నా కోసం కూడా అవార్డు కొనాలి కదా!

Only One Person Is Criticising Gully Boy Says Vijay Varma  - Sakshi

బాలీవుడ్‌లో సినిమా అవార్డుల‌ను ప్ర‌తిభ ఆధారంగా కాకుండా డ‌బ్బులిచ్చి కొనుక్కుంటారన్నా  ఆరోప‌ణ‌ల్ని 'గ‌ల్లీబాయ్' ఫేం న‌టుడు విజ‌య్ వ‌ర్మ ఖండించారు. ఓ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విజ‌య్ మాట్లాడుతూ.. ''గ‌ల్లీబాయ్ చిత్రానికి గానూ ఈ ఏడాది 13 ఫిల్మ‌ఫేర్ అవార్డులు ద‌క్కాయి. దీనిపై కొద్దిమంది లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.  చిత్ర బృందం డ‌బ్బులిచ్చి అవార్డులు కొనుగోలు చేసి ఉంటే మ‌రి నాకోసం కూడా ఓ అవార్డును కొనుగోలు చేయాలి క‌దా? మ‌రి నాకెందుకు అవార్డు రాలేదు?  వివిధ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో నేను  నామినేట్ అయిన‌ట‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అవార్డు కూడా ద‌క్క‌లేదు. ఒక‌వేళ నిజంగానే గ‌ల్లీబాయ్ బృందం డ‌బ్బులిచ్చి అవార్డులు కొని ఉంటే ఉత్త‌మ స‌హాయ న‌టుడి పాత్ర‌కు నాకు కూడా అవార్డు ద‌క్కి ఉండేది క‌దా? మ‌రి 13 అవార్డులు కొన్న‌ప్పుడు నాకోసం కొన‌కుండా ఉంటారా?  వాళ్లు నాతో చాలా ప్రాజెక్టులు చేశారు. మ‌రి ఈ స్నేహంతోనైనా అవార్డు కొని ఉండేవారు క‌దా'' అంటూ ప్ర‌శ్నించారు. కేవ‌లం ఒక్క‌రు మాత్ర‌మే గ‌ల్లీబాయ్ సినిమా అవార్డుల‌కు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నార్నారు. అవార్డులపై చేస్తోన్న ఆరోప‌ణ‌లు నిరాధార‌ణ‌మైన‌వంటూ కొట్టిపారేశారు. చిత్ర యూనిట‌ల్‌కు తాను అండ‌గా ఉంటాన‌ని తెలిపారు. (దానికంటే అవార్డు పెద్దది కాదు)

గ‌ల్లీబాయ్ చిత్రంలో డ్రగ్ పెడ్లర్‌గా విజయ్ అద్భుతమైన నటనకు ప‌లు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక  బాలీవుడ్‌లో బందుప్రీతి (నెపోటిజం )పై వ‌స్తోన్న విమ‌ర్శ‌లపై స్పందించ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. కానీ ఒక స‌మ‌స్య‌ను  అడ్ర‌స్ చేసిన‌ప్పుడు దాన్ని నిజంగా ప‌రిష్క‌రించాల‌న్న ఉద్దేశం ఉండాలే కానీ ఒక‌రిపై ఒక‌రు బుర‌ద చ‌ల్లాల‌నుకోవ‌డం మంచిది కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌ల్లీ బాయ్ చిత్రానికి ఈ ఏడాది 13 అవార్డులు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా జోయా, ఉత్త‌మ నటుడిగా ర‌ణ్‌వీర్‌సింగ్, ఉత్త‌మ న‌టిగా ఆలియా భ‌ట్ స‌హా వివిధ అవార్డులు ద‌క్కాయి. సుశాంత్ మ‌రణానంత‌రం బాలీవుడ్‌లో ఎప్ప‌టినుంచో ఉన్న నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు రావ‌డంతో పాటు అవార్డులు అంశంలోనూ ప‌క్ష‌పాత దోర‌ణి ఉంటుంద‌ని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. (సుశాంత్ కెరీర్‌ను బాలీవుడ్ మాఫియా నాశ‌నం చేసింది)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top