అవార్డుల విషయంలో అన్యాయం.. | Tamannaah React on Nepotism And Award Functions | Sakshi
Sakshi News home page

దానికంటే అవార్డు పెద్దది కాదు

Jul 28 2020 7:34 AM | Updated on Jul 28 2020 7:34 AM

Tamannaah React on Nepotism And Award Functions - Sakshi

సినిమా: దాని కంటే అవార్డు పెద్దదేమీ కాదని అంటోంది నటి తమన్నా. బాలీవుడ్‌లో నెపోటిజం గురించి పెద్ద వివాదమే జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య తరువాత నెపోటిజం వివాదం విశ్వరూపం దాల్చిందనే చెప్పాలి. నటి కంగనారనౌత్‌ ఈ వ్యవహారంలో బహిరంగంగానే విమర్శించింది. దీంతో ఈ అమ్మడు చాలా మందికి శత్రువుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి తమన్నా నెపోటిజం గురించి గొంతు విప్పింది. దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ బ్యూటీ తెలుగు చిత్రం బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెరపై అందాలను ఆరబోయడంలో మిల్కీ బ్యూటీ తరువాతనే ఏ నటి అయినా అన్నంతగా ముద్ర వేసుకుంది. కథానాయకిగా నిర్విరామంగా దశాబ్దం పాటు రాణించిన ఈ బ్యూటీకి ఇటీవల అవకాశాలు తగ్గాయి.

అలా అనడం కంటే హీరోయిన్‌గా అవకాశాలు లేవు అనడం కరెక్ట్‌. కాగా ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా నెపొటిజం గురించి స్పందించింది. ఈ రంగంలో నెపోటిజం ఉన్న మాట నిజమేనని ఇటీవల ఒక భేటీలో పేర్కొంది. అవార్డుల విషయంలో తనకు పలు మార్లు అన్యాయం జరిగిందని వాపోయ్యింది. నిజం చెప్పాలంటే చాలాసార్లు తన పేరు నామినేషన్‌ వరకూ వెళ్లిందని, అయితే అవార్డులు మాత్రం రాలేదని చెప్పింది. అవార్డులు రానంత మాత్రాన ప్రతిభావంతులైన నటీనటులను పక్కన పెట్టలే రని అంది. అభిమానుల ఆదరణ ముఖ్యం అని పేర్కొంది. వారు ఎంత కాలం ఆదరిస్తారో అంత కాలం నిలబడగలం అని చెప్పింది. తన చిత్రాలకు ఆదరణ లభించడం సంతృప్తిగా ఉందని చెప్పింది. అభిమానుల ఆదరణ కంటే అవార్డులు ఎక్కువ కాదని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement