ప్రేక్షకులంతా మిల్కీ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకునే తమన్నా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
టీనేజ్ లోనే హీరోయిన్ గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తమన్నా కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది
పాల లాంటి రంగుతో మెరిసిపోతుంటుంది తమన్నా. అందుకే ఆమెకి మిల్కీ బ్యూటీ అని బిరుదిచ్చారు.
2005లో 'చాంద్ సా రోషన్ సహ్రా' అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది తమన్నా
ఆమె ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది
11th అవర్, నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ షోలలో నటించింది
తమన్నా నటించిన కొత్త వెబ్ సిరీస్ జీ కర్దా
తమన్నా ఓ వ్యక్తితో లవ్‌లో ఉన్నట్లు కొంత కాలంగా ఓ రూమర్ వైరల్ అవుతోన్నసంగతి తెలిసిందే
మిల్కీబ్యూటీ తమన్నా , నటుడు విజయ్ వర్మల మధ్య ఏదో రిలేషన్ ఉందని హిందీ మీడియా కోడై కూస్తోంది
ఈ ఇద్దరూ కలిసి ముంబై వీధుల్లో విహారం చేయడం.. పార్టీలకు అటెండ్ అవ్వడంతో ప్రేమించుకోవడమే కాదు.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటోంది హిందీ మీడియా


