సినిమా తారల తళుకుబెళుకుల వెనక చీకటి, కన్నీటి గాధలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటివి బయటకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ హీరోయిన్ దీనస్థితి విషయం వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ లాంటి గుర్తింపు ఉన్న హీరో సరసన నటించినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడేమో టిఫిన్ బండి నడుపుతూ చాలా సాధారణంగా బతికేస్తోంది. ఇంతకీ ఎవరీమె? ఏంటి స్టోరీ?
(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)
పూజా దద్వాల్. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో 1995లో వచ్చిన వీర్‌గతి సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్‌గా చేసింది. కానీ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఈమె యాక్టింగ్‌తో మెప్పించింది. దీనికంటే ముందు 'జీనే నహీ దూంగీ' చిత్రంలోనూ నటించింది. అయితే వెండితెరపై సక్సెస్ రాకపోయేసరికి టీవీల్లో ప్రయత్నించింది. ఇక్కడా సేమ్ సీన్ రిపీటైంది. ఇక యాక్టింగ్ వల్ల కాదనుకుని పెళ్లి చేసుకుని భర్తతో కలిసి గోవాలో సెటిలైంది.
భర్తతో కలిసి సంతోషంగా ఉన్న టైంలో టీబీ మహమ్మారి ఈమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఓ రోజు వీక్‌నెస్‌తో కిందపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా టీబీ అని తేలింది. దీంతో కట్టుకున్న భర్త, అత్తమామ ఈమెని వదిలించుకోవాలని చూశారు. ముంబైలో వదిలేశారు. ఆఖరికి కన్నవాళ్లు, స్నేహితులు కూడా పట్టించుకోలేదు. దీంతో అనాథ అయిపోయిన ఈమె.. చేతిలో డబ్బుల్లేక అల్లాడిపోయింది. సరిగ్గా ఆ టైంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ ఈమెని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే తనతో పాటు నటించిన సల్మాన్‌ని సాయం అడుగుదామనుకుని ఓ వీడియో చేసింది.
(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)
పూజా చేసిన వీడియో సల్మాన్ వరకు చేరగా.. ఈమెకు సాయం చేసేందుకు అతడు ముందుకొచ్చాడు. పరిస్థితి చూసి చలించిపోయాడు. చికిత్స, ఆహారం, బట్టలు.. ఇలా అవసరమైన ప్రతిదీ ఈమెకు అందేలా చూశాడు. దీంతో చనిపోతుందనుకున్న పూజా.. ఐదు నెలల్లో కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇలా ఉన్నానంటే సల్మాన్ ఖానే కారణమని, ఆయన మేలు మరవలేను అని ఎమోషనల్ అయింది.
కోలుకుని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ముంబైలో చిన్న అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకుంది. పొట్టకూటి కోసం చాలా పనులు చేస్తూ వచ్చింది. 2020లో 'షుక్రానా' అనే పంజాబీ మూవీలో నటించింది. ఇదేమైనా తన తలరాత మారుస్తుందని అనుకుంటే.. ఇదీ నిరాశపరిచింది. ఈమె పరిస్థితి చూడలేకపోయిన దర్శకుడు రాజేంద్ర సింగ్.. టిఫిన్ బండి పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అవసరమైన సామాగ్రి కొనిచ్చి సాయం చేశాడు. అప్పటినుంచి టిఫిన్ బండి నడుపుతూ జీవనం సాగిస్తోంది. గతంలోనే ఈమె స్టోరీ బయటకొచ్చినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)


