Pooja Dadwal
-
ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ
సినిమా తారల తళుకుబెళుకుల వెనక చీకటి, కన్నీటి గాధలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటివి బయటకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ హీరోయిన్ దీనస్థితి విషయం వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ లాంటి గుర్తింపు ఉన్న హీరో సరసన నటించినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడేమో టిఫిన్ బండి నడుపుతూ చాలా సాధారణంగా బతికేస్తోంది. ఇంతకీ ఎవరీమె? ఏంటి స్టోరీ?(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)పూజా దద్వాల్. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో 1995లో వచ్చిన వీర్గతి సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్గా చేసింది. కానీ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఈమె యాక్టింగ్‌తో మెప్పించింది. దీనికంటే ముందు 'జీనే నహీ దూంగీ' చిత్రంలోనూ నటించింది. అయితే వెండితెరపై సక్సెస్ రాకపోయేసరికి టీవీల్లో ప్రయత్నించింది. ఇక్కడా సేమ్ సీన్ రిపీటైంది. ఇక యాక్టింగ్ వల్ల కాదనుకుని పెళ్లి చేసుకుని భర్తతో కలిసి గోవాలో సెటిలైంది.భర్తతో కలిసి సంతోషంగా ఉన్న టైంలో టీబీ మహమ్మారి ఈమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఓ రోజు వీక్నెస్తో కిందపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా టీబీ అని తేలింది. దీంతో కట్టుకున్న భర్త, అత్తమామ ఈమెని వదిలించుకోవాలని చూశారు. ముంబైలో వదిలేశారు. ఆఖరికి కన్నవాళ్లు, స్నేహితులు కూడా పట్టించుకోలేదు. దీంతో అనాథ అయిపోయిన ఈమె.. చేతిలో డబ్బుల్లేక అల్లాడిపోయింది. సరిగ్గా ఆ టైంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ ఈమెని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే తనతో పాటు నటించిన సల్మాన్‌ని సాయం అడుగుదామనుకుని ఓ వీడియో చేసింది.(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)పూజా చేసిన వీడియో సల్మాన్ వరకు చేరగా.. ఈమెకు సాయం చేసేందుకు అతడు ముందుకొచ్చాడు. పరిస్థితి చూసి చలించిపోయాడు. చికిత్స, ఆహారం, బట్టలు.. ఇలా అవసరమైన ప్రతిదీ ఈమెకు అందేలా చూశాడు. దీంతో చనిపోతుందనుకున్న పూజా.. ఐదు నెలల్లో కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇలా ఉన్నానంటే సల్మాన్ ఖానే కారణమని, ఆయన మేలు మరవలేను అని ఎమోషనల్ అయింది.కోలుకుని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ముంబైలో చిన్న అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది. పొట్టకూటి కోసం చాలా పనులు చేస్తూ వచ్చింది. 2020లో 'షుక్రానా' అనే పంజాబీ మూవీలో నటించింది. ఇదేమైనా తన తలరాత మారుస్తుందని అనుకుంటే.. ఇదీ నిరాశపరిచింది. ఈమె పరిస్థితి చూడలేకపోయిన దర్శకుడు రాజేంద్ర సింగ్.. టిఫిన్ బండి పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అవసరమైన సామాగ్రి కొనిచ్చి సాయం చేశాడు. అప్పటినుంచి టిఫిన్ బండి నడుపుతూ జీవనం సాగిస్తోంది. గతంలోనే ఈమె స్టోరీ బయటకొచ్చినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?) -
టీబీ వల్ల బతుకుచిధ్రం.. ఆ హీరోయిన్ను అందరూ వదిలేశారు!
ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టింది. 'వీర్గతి(1995)' మూవీలో సల్మాన్ సరసన హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. కానీ ఆమె మాత్రం ప్రేక్షకుల మనసు గెలిచింది. ఆ హీరోయినే పూజా దద్వాల్. దీనికంటే ముందు 'జీనే నహీ దూంగీ' అనే సినిమాలోనూ తళుక్కుమని మెరిసింది. సినిమాల్లో లక్ కలిసి రావడం లేదని టీవీలోనూ ప్రయత్నించింది. ఇక్కడ పేరు తెచ్చుకుంటే సినిమా అవకాశాలు వస్తాయని కలలు కంది. అయినా పెద్ద ఉపయోగం లేకపోయింది. అడపాదడపా సినిమాలు చేసింది కానీ నిలదొక్కుకోలేకపోయింది. సినిమాల మీద ఆశ చాలించుకుని పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి గోవాలో సెటిలైంది. టీబీతో జీవితం అతలాకుతలం జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఒకరోజు సడన్‌గా వీక్నెస్తో కిందపడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా తనకు టీబీ ఉందని తెలిసింది. ఈ విషయం తెలియగానే ఆమె భర్త, అత్తామామ తనను వదిలించుకోవాలని చూశారు. ముంబైలో వదిలేశారు. కన్నవాళ్లు, స్నేహితులు.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అందరూ ఉన్న అనాథ అయిపోయింది. ఆ సమయానికి పూజ చేతిలో డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం.. ఇలా ఏదీ లేదు. చావు కోసం ఎదురుచూడటం తప్ప చేయగలిగేదేముందనుకుంది. ఆ సమయంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. సాయం చేసిన హీరో తనతోపాటు యాక్ట్ చేసిన సల్మాన్‌ను ఓసారి సాయం అడిగి చూద్దామనుకుంది. 'ప్రస్తుతం నా దగ్గర చిల్లిగవ్వ లేదు. కనీసం టీ తాగాలన్నా ఇతరులపైనే ఆధారపడుతున్నాను. సల్మాన్ సాయం చేస్తే బాగుంటుంది' అని చెప్పింది. ఆ వీడియో సల్మాన్ దాకా చేరింది. ఆమె పరిస్థితి చూసి చలించిపోయాడు. తన ఫౌండేషన్‌కు చెప్పి చికిత్స, ఆహారం, బట్టలు.. ఇలా ప్రతీది అందించాడు. అతడు అందించిన సహకారంతో ఐదు నెలల్లో కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు.. తాను బతికి ఉండటానికి కారణం సల్మాన్ అని.. ఆయన చేసి మేలు మరవలేనంటూ ఎమోషనలైంది. టిఫిన్ బండి నడుపుకుంటూ.. తర్వాత ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులోనే నివసించడం మొదలుపెట్టింది. పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేసింది. 2020లో పంజాబీ మూవీ షుక్రానా: గురునానక్ దేవ్‌జీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో తన కలలన్నీ ఛిద్రమయ్యాయి. తన పరిస్థితి చూడలేక రాజేంద్రసింగ్.. ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అందుకు అవసరమైన సామాగ్రి కూడా అతడే కొనిచ్చాడట. అదే ఆమె బతుకుదెరువైంది. ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటూ ఆ టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ బతుకుబండి లాగిస్తోంది. వంద రూపాయలు వచ్చినా చాలని కష్టపడుతోంది అలనాటి అందాల తార! చదవండి: కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన సామ్.. అతడి రియాక్షన్ చూశారా? -
దీనస్థితిలో నటి.. సల్మాన్ ఆపన్నహస్తం!
సాక్షి, న్యూఢిల్లీ: తనతో కలిసి నటించిన హీరోయిన్ అత్యంత దీనమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆమెకు సాయం చేశాడు. సల్మాన్ హీరోగా 90ల్లో వచ్చిన 'వీర్‌గాటి' చిత్రంలో నటించిన పూజా దద్వాల్ అనే హీరోయిన్ ప్రస్తుతం టీబీ వ్యాధి భారిన పడి వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ సాయం కోసం ఆమె గతంలో మీడియా ద్వారా వేడుకోగా.. ఎట్టకేలకు ఆ విషయం సల్మాన్‌కి తెలిసింది. దబాంగ్ టూర్ లో భాగంగా పుణెకి వచ్చిన సల్మాన్ అనారోగ్యంతో బాధపడుతున్న పూజా దద్వాల్ పరిస్థితి విని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెకు సహాయం చేస్తానన్నారు. సల్మాన్ మాట్లాడుతూ...‘ఆమె అనారోగ్యంతో ఉన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే మా టీంని ఆసుపత్రికి పంపిచా. ఆమెకు కావాల్సిన సాయం అందిస్తా. ఆరోగ్యంతో పూజా దద్వాల్ బయటకు వస్తుందనే నమ్మకం ఉందని’ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఆమెను ఆదుకోవటానికి రేసుగుర్రం మూవీ ప్రతినాయకుడు రవికిషన్ ముందుకొచ్చి... తన స్నేహితుని ద్వారా పూజాకి సాయం చేశారు. చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు. పూజా దద్వాల్ కొన్ని రోజుల కిందట ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘6 నెలల కిందట టీబీ ఉందని తెలిసింది. అప్పటి నుంచి సల్మాన్ ను సాయం అడుగుదామని యత్నిస్తున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. నా వీడియోను చూస్తే ఎంతో కొంత సాయం చేస్తాడన్న ఆశ ఉంది. కొన్ని రోజులుగా ఇదే హాస్పిటల్లో ఉన్నాను. నా దగ్గర నయా పైసా కూడా లేదు. కనీసం టీ కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నదంటూ’ పూజా వాపోయిన విషయం తెలిసిందే. పూజా ఆరోగ్యం బాగా లేదని తెలిసిన తర్వాత భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి పంపించేశారు. సినిమాల్లో అవకాశాలు లేక పోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టిన పూజా గత కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్మెంట్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూనే జీవనం సాగిస్తున్నారు. -
దీనస్థితిలో సల్మాన్ హీరోయిన్!
సాక్షి, ముంబై : సినిమా.. అదో రంగుల ప్రపంచం. స్టార్డమ్ ఉన్నంత వరకు ఆడిందే ఆటగా జీవితం సాగిపోతుంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు ఇలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేస్తారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అదృష్టం ఉన్నంత వరకు జల్సాగా నడిచే జీవితం.. అది కాస్త తిరగబడితే బతుకు రోడ్డు మీద కొచ్చేస్తుంది. అవకాశాలు ఉన్నపుడు కోట్లు తీసుకున్న నటీనటులు అవకాశాలు లేక కూటికోసం అల్లాడిపోయిన సంఘటనలు కోకొల్లలు. బాలీవుడ్ హీరోయిన్ పూజా దాద్వల్ జీవితంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పరిస్థితులే కాదు అనారోగ్యం కూడా ఆమె పాలిట శాపంలా మారింది. టీబీ మహమ్మారి ఆమెకు బతుకు భారంగా మారింది. సరైన తిండి లేక, మందులు కొనడానికి డబ్బులు లేక దీనంగా జీవితాన్ని వెల్లదీస్తోంది. 1995లో వచ్చిన సల్మాన్ ఖాన్ బ్లాక్ బాస్టర్ ‘వీర్‌గాటి’ సినిమాలో నటించి మెప్పించింది పూజ. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కుంటోంది. పూజ ముంబైలోని శివ్‌ది హాస్సిటల్లో చికిత్స పొందుతోంది. ‘‘ఆరు నెలల కిందట నాకు టీబీ ఉందని తెలిసింది. సల్మాన్ ఖాన్ని సహాయం అడగడానికి ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. 15 రోజుల కిందటే శివ్‌ది హాస్సిటల్లో చేరాను. ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కనీసం టీ తాగడానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని’ ఆమె తెలిపింది. పూజ దావల్కు టీబి ఉందని తెలుసుకున్న భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయారట. బాలీవుడ్ హిట్ చిత్రాలు హిందుస్తాన్, వీర్‌గాటి, సింధూర్ సౌగంథ్లో నటించిన విషయం తెలిసిందే.


