రావు బహదూర్ మూవీ.. ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ | Satya Dev Rao Bahadur Movie O Sundari Lyrical Video song out now | Sakshi
Sakshi News home page

Rao Bahadur Movie: రావు బహదూర్ మూవీ.. రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్

Apr 15 2026 9:25 PM | Updated on Apr 15 2026 9:25 PM

Satya Dev Rao Bahadur Movie O Sundari Lyrical Video song out now

టాలీవుడ్ హీరో సత్యదేవ్‌ నటిస్తోన్న తాజా చిత్రం రావు బహదూర్. ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వెంకటేష్‌ మహా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్‌ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్‌లో సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్‌ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో.. ఏప్లస్‌ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓ సుందరి అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందిచగా.. విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఈ పాటను స్మరణ్ సాయి కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల,  బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రావు బహదూర్ చిత్రం ఈ ఏడాది సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement