సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహంచారు. ఈ మూవీలో దీపా థామస్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ మహేశ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మునుపెన్నడు చూడని తెలుగు సినిమా రావు బహదూర్ అంటూ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మహేశ్ బాబు. కాగా.. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతమందించారు.


