అది నాకు కొత్త కాదు.. సహజీవనం చేస్తుంటా: సత్యదేవ్ | Tollywood Hero Satya Dev Made Interesting Comments At Rao Bahadur Success Meet, Deets Inside | Sakshi
Sakshi News home page

Rao Bahadur Movie: 'ఓఆర్ఆర్ వద్ద పది ఎకరాలు కొనొచ్చు'

Jul 5 2026 6:57 AM | Updated on Jul 5 2026 10:16 AM

Tollywood Hero Satya Dev Comments at Rao Bahadur Success meet

సత్యదేవ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రావు బహదూర్.  ఈ నెల 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జంటగా దీపా థామస్ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీకి కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించారు. మహేశ్‌ బాబు–నమ్రతా శిరోద్కర్‌ జీఎంబీ ఎంటర్‌టైన్ మెంట్‌ సమర్పణలో ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్స్‌ చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర నిర్మించారు.

ఈనెల 3న థియేటర్లలో రిలీజైన ఈ ‍సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన సత్యదేవ్ తన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తన మూవీస్ చాలా నిరాశ పరిచాయని ‍అన్నారు. రావు బహదూర్ లాంటి గొప్ప సినిమాను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.  

సత్యదేవ్ మాట్లాడుతూ..' గతంలో నా సినిమాలు వచ్చినప్పుడు .. ఇది వర్కవుట్‌ అవుతుందని చెప్పేవారు. అంతేకాదు ఈ మూవీ హిట్ అయితే మీరు ఓఆర్ఆర్ వద్ద ఓ పది ఎకరాలు కొనొచ్చు అనేవారు. నాకు డిసప్పాయింట్‌మెంట్‌ అనేది కొత్త కాదు. దాంతో నేను, మహా సహజీవనం చేస్తుంటాం. సక్సెస్ అనేది కొత్త. ఈ రోజు సక్సెస్ వచ్చింది అనే పాయింట్ కంటే.. ఈ సినిమా జనాలు చూడకపోతే ఒక గొప్ప చిత్రాన్ని కోల్పోతారనే ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీ జనాలు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement