ఒక్కసారి పలకరించు తమ్ముడు.. నటుడు బ్రహ్మానందం అన్నయ్య ఆవేదన | Brahmanandam Brother Makes Emotional Appeal, Says I Don’t Need Money, Just Call Me Once, Video Went Viral | Sakshi
Sakshi News home page

ఒక్కసారి పలకరించు తమ్ముడు.. నటుడు బ్రహ్మానందం అన్నయ్య ఆవేదన

Aug 19 2026 11:49 PM | Updated on Aug 20 2026 10:43 AM

Actor Brahmanandam elder brother Grief Talk With Him

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీవదన్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వృద్ధాప్యంలో ఉన్న తనను తమ్ముడు ఒక్కసారి ఫోన్ చేసి ‘ఎలా ఉన్నావ్ అన్నయ్య?’ అని పలకరిస్తే చాలని ఆయన అన్నారు.

తమ కుటుంబంలో ఆరుగురు సంతానం ఉండగా అందులో నలుగురు ఇప్పటికే చనిపోయారు. ప్రస్తుతం తాము ఇద్దరమే మిగిలాం. అయితే తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయిన భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు మళ్లిన కాలంలో తోడబుట్టిన వారు ఒకరికొకరు తోడుగా ఉండాలనే ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి ‘ఏరా అన్నయ్య.. ఎలా ఉన్నావ్?’ అని ఒకేఒక్క మాట అడుగుతాడేమో అని నేను ప్రతి రోజూ ఆశగా చూస్తున్నాను. ఈ సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నవారు వచ్చి పలకరిస్తే, చిన్నవారికి అది ఎంతో సంతోషంగా ఉంటుందని ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఇటీవల బ్రహ్మానందం తన స్వగ్రామానికి వచ్చినా తనను కలవకుండానే వెళ్లిపోయారు. గతంలో బ్రహ్మానందం తనకు ఇల్లు కట్టించడంతో పాటు పిల్లల పెళ్లిళ్లకు సాయం కూడా చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. మిగతా తోడబుట్టిన వారికి కూడా బ్రహ్మానందం సాయం అందించాడు. తన తమ్ముడు తన కుటుంబానికి గతంలో సాయం చేసినట్లు అంగీకరిస్తూనే.. చాలా ఏళ్ల నుంచి తనని కలవకపోవడం, పలకరించకపోవడం పట్ల ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రహ్మానందం చదువు కోసం చిన్నతనంలోనే అత్తిలి వెళ్లిపోయాడు. అక్కడే లెక్చరర్‌గా ఉద్యోగం కూడా సంపాదించాడు. అనంతరం అక్కడే ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఆ పెళ్లి తమ తండ్రికి నచ్చకపోయినా తామంతా నచ్చజెప్పి తన పెళ్లికి వెళ్లాము. ఆ తర్వాత బ్రహ్మానందం సినిమాల్లో అవకాశం సంపాదించి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు.

‘‘నాకు డబ్బు అవసరం లేదు. తమ్ముడు ఒక్కసారి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగితే చాలు’’ అంటూ శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement