మా సినిమా చూసి మహేశ్‌ బాబు ఆశ్చర్యపోయాడు | Chinta Gopalakrishna Reddy Made Interesting Comments About Rao Bahadur Movie, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

మా సినిమా చూసి మహేశ్‌ బాబు ఆశ్చర్యపోయాడు: చింతా గోపాలకృష్ణా రెడ్డి

Jun 25 2026 8:12 AM | Updated on Jun 25 2026 9:46 AM

Chinta Gopalakrishna Reddy Talk About Rao Bahadur Movie

‘‘ఈ రోజుల్లో కొత్తదనం లేకుండా సినిమా చేయడం చాలా కష్టం. ఒక జానర్‌ హిట్టయిందని అదే తరహాలో మరో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతినివ్వాలనే సంకల్పంతో ‘రావు బహదూర్‌’ చిత్రాన్ని నిర్మించాం. మా మూవీ సమర్పకుడు హీరో మహేశ్‌బాబుగారు ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయారు. ఔట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని ఆయన చెప్పడంతో సినిమా విజయంపై మాకు మరింత నమ్మకం పెరిగింది’’ అని నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. 

సత్యదేవ్, దీపా థామస్‌ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్‌’. వెంకటేష్‌ మహా దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర నిర్మించిన ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా చింతా గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాతగా తెలుగులో ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు, యశోద, క, చిదంబరం’, తమిళంలో సముద్ర ఖనితో ‘తిరుమాణిక్యం’ చిత్రాలు చేశాను. ‘రావు బహదూర్‌’ కథను మొదట నమ్రతగారు విన్నారు. ఆమెకు చాలా నచ్చింది. రావు బహదూర్‌ పాత్రకు సత్యదేవ్‌ కరెక్ట్‌గా సరిపోయారు. భిన్నమైన సినిమాలు చేయాలనుకోవడం వల్లే అనురాగ్, శరత్, నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాం.

 కథ, సెట్స్, కాస్ట్యూమ్స్, నిర్మాణ విలువలు చూస్తే ‘బాహుబలి’ తరహా భారీ నిర్మాణ అనుభూతి కలుగుతుంది. మా సినిమా ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభవాన్ని, పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం నేను నిర్మించిన రెండు సినిమాల్లో ఒకటి వినాయక చవితికి, మరొకటి దసరాకు విడుదలవుతాయి’’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement