నాగబంధం vs రావు బహదూర్.. ఎవరికి ఎన్ని కోట్లు వచ్చాయ్? | Nagabandham And Rao Bahadur Movies Day 1 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Latest Movie Collection: తొలిరోజు వసూళ్లలో ఎవరి షేర్ ఎంత?

Jul 4 2026 3:37 PM | Updated on Jul 4 2026 3:40 PM

Nagabandham And Rao Bahadur Movies Day 1 Collection Worldwide

ఈ వీకెండ్ భారీ బడ్జెట్ సినిమాలు కానప్పటికీ ఓ మాదిరి హైప్‌తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి నాగబంధం, రావు బహదూర్ చిత్రాలు వచ్చాయి. రెండు వేర్వేరు జానర్ మూవీస్ కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించారు. అందుకు తగ్గట్లే ఒకటి గ్రాఫిక్స్ పరంగా ఆకట్టుకోగా.. మరొకటి చిత్రమైన కాన్సెప్ట్‌తో వచ్చింది. మరి వీటికి తొలిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయ్?

విరాటకర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా చేసిన 'నాగబంధం' సినిమాని బ్రహ్మకమలం, అనంత పద్మనాభి స్వామి నిధి, సనాతన ధర్మం తదితర అంశాలతో తెరకెక్కించారు. స్టోరీ పరంగా వీక్ అనే టాక్ వినిపిస్తున్నప్పటికీ మూడు గంటలకు పైగా నిడివితో ప్రతి ఫ్రేమ్‌లో గ్రాఫిక్స్‌తో భారీతనం కనిపించిందని చూసినవాళ్లు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.3.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

ఇకపోతే సత్యదేవ్ హీరోగా, వెంకటేశ్ మహా దర్శకత్వం వచ్చిన సినిమా 'రావు బహదూర్'. 1968, 1991 కాలంలో ఓ రాజ వంశానికి చెందిన ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన కల్పిత కథ ఇది. అనుమానం పెనుభూతం అనే అంశాన్ని మేజర్‌గా తీసుకున్నప్పటికీ సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో టీమ్ విఫలమైంది. చాలా బుర్రపెట్టి చూస్తే తప్పితే ఈ చిత్రం అర్థం కాని పరిస్థితి. ఇక ఈ సినిమాకు తొలిరోజు రూ.3.9 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.

(ఇదీ చదవండి: 'రావు బహదూర్' సినిమా రివ్యూ)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement