తెలుగు సినిమాకు ఒక లవ్‌ లెటర్‌ ‘రావు బహదూర్‌’ | Satya Dev Talk About Rao Bahadur At More Than A Teaser | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాకు ప్రేమలేఖ రావు బహదూర్‌

Jul 1 2026 12:25 PM | Updated on Jul 1 2026 1:08 PM

Satya Dev Talk About Rao Bahadur At More Than A Teaser

‘‘తెలుగు సినిమాకు మేము రాస్తున్న ప్రేమలేఖ ‘రావు బహదూర్‌’ సినిమా. మహేశ్‌ బాబుగారు కూడా ఈ సినిమా చూసి ‘ఇది తెలుగు సినిమాకు ఒక లవ్‌ లెటర్‌’ అని చెప్పారు’’ అని హీరో సత్యదేవ్‌ పేర్కొన్నారు. వెంకటేష్‌ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థామస్‌ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్‌’. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో ఎ ప్లస్‌ ఎస్‌ మూవీస్, శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర నిర్మించిన ఈ మూవీ ఈ నెల 3న విడుదలవుతోంది. కాగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘మోర్‌ దాన్‌ ఏ టీజర్‌’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 

ఈ వీడియోకు చిత్ర సమర్పకుడు, హీరో మహేశ్‌ బాబు అందించిన వాయిస్‌ ఓవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ఈ సందర్భంగా అనురాగ్‌ రెడ్డి మాట్లాడుతూ–  ‘‘మహేశ్‌ బాబుగారు ఒక సినిమాను ప్రజెంట్‌ చేస్తున్నారంటే కచ్చితంగా దానిపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను మా చిత్రం అందుకుంటుందని మా నమ్మకం’’ అని పేర్కొన్నారు. వెంకటేష్‌ మహా మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమా కిరీటంలో ‘రావు బహదూర్‌’ మరో కలికితురాయిగా నిలుస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా చూసిన కొద్దీ మళ్లీ చూడాలనిపిస్తుంది’’ అన్నారు గోపాలకృష్ణా రెడ్డి. ‘‘మా సినిమాతో ప్రేక్షకులకు చాలా భిన్నమైన అనుభూతి కలుగుతుంది’’ అని నిర్మాత శరత్‌ చంద్ర పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాతో నా కల నెరవేరినట్టు అయింది’’ అన్నారు హీరోయిన్‌ దీప థామస్‌.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement