నా కెరీర్‌లోనే తొలిసారి డ్యాన్స్‌ చేశాను: సత్యదేవ్‌ | Satya Dev about Rao Bahadur movie | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లోనే తొలిసారి డ్యాన్స్‌ చేశాను: సత్యదేవ్‌

Jun 21 2026 1:03 AM | Updated on Jun 21 2026 11:07 AM

Satya Dev about Rao Bahadur movie

వెంకటేష్‌ మహా, అనురాగ్‌ రెడ్డి, సత్యదేవ్‌

‘‘రావు బహదూర్‌’లో నా కెరీర్‌లోనే తొలిసారి బాగా డ్యాన్స్‌ చేశాను. ఈ మూవీలో ఉన్న పాటల్లో ‘దేశ సంచారి’ సాంగ్‌లో డ్యాన్స్‌కి స్కోప్‌ ఉంది. ఇది సాల్సా స్టయిల్‌ డ్యాన్స్‌. ఇలాంటి డ్యాన్స్‌ చేయాలంటే పది, పదిహేనేళ్ల ప్రాక్టీస్‌ కావాలి. నాకెంతో ఓపికగా నేర్పించి, చేయించిన మా డ్యాన్స్‌ మాస్టర్‌కు థ్యాంక్స్‌’’ అని హీరో సత్యదేవ్‌ పేర్కొన్నారు. వెంకటేష్‌ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థామస్‌ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్‌’. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర నిర్మించిన ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది.

స్మరణ్‌ సాయి సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘దేశ సంచారి..’ అంటూ సాగే సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ పాటకు రెహమాన్‌ సాహిత్యం అందించగా హేమచంద్ర, ప్రియాంక గజానన్‌ పాడారు. ఈ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన ఏడు గెటప్స్‌లో రామప్ప గెటప్‌ నాకు చాలా ఇష్టమైనది ’’ అని చెప్పారు. వెంకటేష్‌ మహా మాట్లాడుతూ– ‘‘సత్య, నేను బ్రదర్స్‌లా ఉంటాం. మనం ఏం కోరుకుంటామో దాన్ని అద్భుతంగా తెరపై చూపించగలడు’’ అని పేర్కొన్నారు. అనురాగ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో సత్యదేవ్‌గారు కనిపించే ఏడు గెటప్స్‌లో ప్రతి గెటప్‌కు ప్రత్యేకమైన లుక్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ కుదిరింది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement