సత్యదేవ్ సాహసం.. రావు బహదూర్ టీజర్ రిలీజ్ | SatyaDev latest Movie Rao Bahadur Teaser Out now | Sakshi
Sakshi News home page

Rao Bahadur Teaser: సత్యదేవ్ సాహసం.. రావు బహదూర్ టీజర్ రిలీజ్

Jun 12 2026 9:20 PM | Updated on Jun 12 2026 9:20 PM

SatyaDev latest Movie Rao Bahadur Teaser Out now

సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్.  ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్‌ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్‌ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్‌ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటైర్టెన్మెంట్స్‌ సమర్పణలో నిర్మిస్తున్నారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ రోల్ చూస్తుంటే విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్స్‌లో సత్యదేవ్ అదరగొట్టేశారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో సత్యదేవ్‌ పాత్ర సరికొత్తగా ఉండనుందని టీజర్‌తోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement