నా కెరీర్‌లో ఓ మైలురాయి: సత్యదేవ్‌ | Satyadev about Rao Bahadur movie | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో ఓ మైలురాయి: సత్యదేవ్‌

Jul 3 2026 4:49 AM | Updated on Jul 3 2026 5:49 AM

Satyadev about Rao Bahadur movie

శరత్, గోపాలకృష్ణ, వెంకటేష్‌ మహా, సత్యదేవ్, అనురాగ్‌

సత్యదేవ్, దీపా థామస్‌ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్‌’. వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించారు. మహేశ్‌ బాబు–నమ్రతా శిరోద్కర్‌ జీఎంబీ ఎంటర్‌టైన్ మెంట్‌ సమర్పణలో ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్స్‌ చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర నిర్మించిన ఈ మూవీ నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సత్యదేవ్‌ మాట్లాడుతూ–‘‘సైకలాజికల్‌ డ్రామాగా రూపొందిన చిత్రం ‘రావు బహదూర్‌’. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది. వంద శాతం విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని తెలిపారు.

‘‘ఈ సినిమాకు ఎలాంటి రిఫరెన్స్  లేదు. నవ్విస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది’’ అని వెంకటేష్‌ మహా పేర్కొన్నారు. ‘‘ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా ఓపెన్‌ మైండ్‌తో మా సినిమాకు రావాలి.. సరికొత్త అనుభూతి కలుగుతుంది’’ అన్నారు అనురాగ్‌ రెడ్డి. ‘‘మా సినిమా చాలా కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అని శరత్‌ చంద్ర, గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement