'తొలిసారి ఆ మాటలు విన్నా'.. రావు బహదూర్ హీరోయిన్ ఎమోషనల్ | Know Reason Behind Why Rao Bahadur Movie Actress Deepa Thomas Gets Emotional At Success Meet | Sakshi
Sakshi News home page

Rao Bahadur Movie: 'తొలిసారి ఆ మాటలు విన్నా'.. హీరోయిన్ కన్నీటి పర్యంతం

Jul 5 2026 7:24 AM | Updated on Jul 5 2026 10:29 AM

Rao Bahadur Movie actress Deepa Thomas emotional at success meet

సత్యదేవ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రావు బహదూర్.  ఈ నెల 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జంటగా దీపా థామస్ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీకి కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సక్కెస్ టాక్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. హైదరాబాద్‌లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హీరోయిన్ దీపా థామస్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ భావోద్వేగానికి గురైంది. ఈ సినిమా చూసిన మా నాన్న తనను పొగిడారంటూ ఎమోషనలైంది. నా కెరీర్‌లో తొలిసారి అలాంటి మాటలు విన్నానని ఏడ్చేసింది. నేను కూడా ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశా. వారి రెస్పాన్స్‌ చూసి ఎమోషనలయ్యా అంటూ రావు బహదూర్ సక్సెస్ ఈవెంట్‌లో మాట్లాడుతూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.

దీపా థామస్ మాట్లాడుతూ..' నా పేరేంట్స్‌కు తెలుగు రాదు. వాళ్లు ఈ సినిమాని సబ్‌టైటిల్స్‌తో చూశారు. ఈ సినిమా చూసి మా నాన్న చెప్పారు. ఇంకా బాగా చేయాలని తొలిసారి నాన్న నాతో అన్నారు. ఇదే నా కెరీర్‌లో అత్యంత గొప్ప ప్రశంస. మన వీక్‌ పాయింట్ ఎవరికీ తెలియొద్దని మహాగారు చెప్పారు. అందుకే ఈరోజు నేను ఏడావలనుకోవడం లేదు' అంటూ ఫుల్‌ ఎమోషనలైంది. స్టేజీపై మాట్లాడుతూ దీపా థామస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

దీపా థామస్ కెరీర్..

కేరళకు చెందిన దీపా థామస్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. రావు బహదూర్‌తో గ్రాండ్ సక్సెస్ కొట్టేసింది. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన  తర్వాత మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మొదట మిస్‌ మిలీనియల్‌ అందాల పోటీలో టాప్‌ 10లో నిలిచింది. ఆ తర్వాత మిస్‌ సౌత్‌ ఇండియా పోటీలో సెకండ్‌ రన్నరప్‌ టైటిల్‌ గెలుచుకుంది. అలా రాక్‌ పేపర్‌ సీజర్స్‌ అనే వెబ్‌సిరీస్‌తో సినీ కెరీర్‌ ప్రారంభించింది. వైరస్ అనే‌ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. 'హోమ్‌' సినిమాతో ఫేమస్ అయింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన దీపా థామస్ తెలుగులో రావు బహదూర్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement