'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా | Mahesh Babu Produced Rao Bahadur Movie Release Date | Sakshi
Sakshi News home page

Rao Bahadur Movie: మహేశ్ నిర్మించిన మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Apr 26 2026 4:42 PM | Updated on Apr 26 2026 4:45 PM

Mahesh Babu Produced Rao Bahadur Movie Release Date

ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ తొలి వారంలో ఇది థియేటర్లలోకి రానుంది. కానీ ఇంతకంటే ముందే మహేశ్ ఓ మూవీతో రాబోతున్నాడు. కాకపోతే ఇది ఈయన నటించిన చిత్రం కాదు నిర్మాతగా వ్యవహరించినది. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు)

కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మహా తీసిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించాడు. గతేడాది ఆగస్టులోనే టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది. కొన్నిరోజుల క్రితం తొలి పాట రిలీజ్ చేశారు. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ వదిలారు.

జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మహేశ్‌బాబు, నమ్రత.. ఈ చిత్రాన్ని‌ సమర్పిస్తున్నారు. శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థలపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌చంద్ర నిర్మిస్తున్నారు. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే ఈ సినిమాని సైకలాజికల్‌ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement