ఓటీటీలో రాకాస.. అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది | Rakasa Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రాకాస.. అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది

Apr 26 2026 7:45 AM | Updated on Apr 26 2026 12:11 PM

Rakasa Movie OTT Streaming Details

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా విడుదలైన కొత్త సినిమా రాకాస... బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. రాకాస చిత్రంలో సంగీత్ శోభన్- నయన్ సారిక హీరో హీరోయిన్‌గా నటించారు.  ఓటీటీ సిరీస్‌లతో బాగా పాపులర్‌ అయిన దర్శకురాలు మానస శర్మ ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు.

రాకాస చిత్రం 2026 మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా సదరు ఓటీటీ యాప్ కేటలాగ్‌లో అధికారికంగా చేర్చబడింది.   అయితే, ఓటీటీ ప్రేక్షకుల కోసం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషలలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రాకాస చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 27 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఓటీటీ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో  రూ. 10 కోట్లకు ఢీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా రాకాస చిత్రం నిర్మాత నిహారికకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

కథేంటంటే.. 
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్‌ వీరు(సంగీత్‌ శోభన్‌).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్‌ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్‌) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్‌పోర్ట్‌ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్‌పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్‌ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.

అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్‌ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement