breaking news
V.V Vinayak
-
‘మిస్సింగ్ మేఘన’ హిట్ కావాలి : వి.వి. వినాయక్
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని డైరెక్టర్ వి.వి. వినాయక్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారు మాట్లాడుతూ .. ‘బెక్కం వేణుగోపాల్ , శ్రీనివాస్ సపోర్ట్ తో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమా తో హీరో రామ్ కార్తీక్ కి దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా సంగీత దర్శకుడు ధృవన్కి మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో ఈ టీం కి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ ..‘ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులు మిచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి గారికి ప్రొడ్యూసర్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది అని ఆశిస్తున్నా’అని హీరో రామ్ కార్తీక్ అన్నారు.‘ఈ సినిమా కి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మ్యూజిషియన్ కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా నాకు చాలా మంచి అవకాశం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మా టీం ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్ అన్నారు. -
‘అఖిల్ ’ మూవీ మేకింగ్
-
'వినాయక్ చిత్రంలో చాన్స్ రావడం అదృష్టం'
చెన్నై: ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమని బాలీవుడ్ అలనాటి నటి సైరాబాను మనవరాలు సయ్యేషా సంతోషం వ్యక్తం చేశారు. వినాయక్ దర్షకత్వంలో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ హీరో సరసన నటించే చాన్స్ సయ్యేషాకు వచ్చింది. టాలీవుడ్లో సయ్యేషాకు ఇదే తొలి చిత్రం. సయ్యేషాకు బాలీవుడ్‌లోనూ అజయ్ దేవగన్ సినిమాలో అవకాశం వచ్చింది. కాగా ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లాల్సివుంది. 'కెరీర్ ఆరంభంలోనే రెండు పెద్ద ప్రాజెక్టుల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అజయ్ దేవగన్ తన డ్రీమ్ ప్రాజెక్టులోకి తనను తీసుకోవడం గొప్ప విషయం. అలాగే తెలుగులో అరంగేట్రం చిత్రంలో నటించడం ఉత్సుకతగా ఉంది. వినాయక్ బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారని విన్నా. ఆయన సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయం కానుండటం గౌరవంగా భావిస్తున్నా' అని సయ్యేషా చెప్పారు. -
వీవీ వినాయక్‌కు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, చాగల్లు/హైదరాబాద్: సినీ దర్శకుడు వీవీ వినాయక్ తల్లి గండ్రోతు నాగరత్నం మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులోని స్వగృహంలో ఉన్న వినాయక్‌ను బుధవారం ఉదయం ఆయన ఫొన్లో పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా నాగరత్నం అంత్యక్రియలు బుధవారం చాగల్లు శివారులోని వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఎమ్మెల్యేలు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), జీవన్‌రెడ్డి, బడేటి బుజ్జి, సినీ నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, వీవీ దానయ్య, దర్శకులు మెహర్ రమేశ్, సంతోష్ శ్రీనివాస్, చిన్నికృష్ణ, మాటల రచయితలు ఆకుల శివ, రాజేంద్రప్రసాద్‌లు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.


