సినీ దర్శకుడు వీవీ వినాయక్ తల్లి గండ్రోతు నాగరత్నం మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు.
సాక్షి, చాగల్లు/హైదరాబాద్: సినీ దర్శకుడు వీవీ వినాయక్ తల్లి గండ్రోతు నాగరత్నం మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులోని స్వగృహంలో ఉన్న వినాయక్‌ను బుధవారం ఉదయం ఆయన ఫొన్లో పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా నాగరత్నం అంత్యక్రియలు బుధవారం చాగల్లు శివారులోని వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఎమ్మెల్యేలు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), జీవన్‌రెడ్డి, బడేటి బుజ్జి, సినీ నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, వీవీ దానయ్య, దర్శకులు మెహర్ రమేశ్, సంతోష్ శ్రీనివాస్, చిన్నికృష్ణ, మాటల రచయితలు ఆకుల శివ, రాజేంద్రప్రసాద్‌లు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.