‘బాలన్‌- ది బాయ్‌’ మూవీ రివ్యూ | Balan: The Boy Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘బాలన్‌- ది బాయ్‌’ మూవీ రివ్యూ .. మరో మలయాళ ఆణిముత్యం!

Jun 20 2026 1:38 PM | Updated on Jun 20 2026 2:15 PM

Balan: The Boy Movie Review And Rating In Telugu

టైటిల్‌ : బాలన్‌- ది బాయ్‌
నటీనటులు : ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్‌, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్, జీన్ పాల్ లాల్, గిరిష్ ఏడి తదితరులు
దర్శకత్వం : చిదంబరం
నిర్మాతలు : వెంకట్ కె నారాయణ, షైల్జా దేశీ ఫెన్
సంగీతం : సుషిన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ: షిజు ఖలీద్
ఎడిటర్‌: వివేక్ హర్షన్

ఈ వారం సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో పాటు నాలుగైదు సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి మలయాళ మూవీ కూడా ఉది. అదే ‘బాలన్‌-ది బాయ్‌’. ‘మంజుమ్మల్‌ బాయ్స్’తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్‌)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్‌) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. కొడుకుకు ప్రతిసారి ఒక కథ చెబుతూ.. ఎవరు అడిగినా తాను చెప్పినట్లుగానే చెప్పాలని ట్రైనింగ్‌ ఇస్తుంది. ఆరేళ్ల ఆ బాలుడు తల్లి చెప్పినట్లుగానే చేస్తాడు. అలా తమ ఐడెంటిటీని మారుస్తూ పలు ఊర్లు తిరిగి.. చివరకు ఒక వృద్ధురాలి దగ్గర కేర్‌ టేకర్‌గా చేరుతారు. కొన్నాళ్ల తర్వాత ఆమె చనిపోతుంది. అ  విషయాన్ని లండన్‌లో ఉన్న ఆమె కొడుకు దగ్గర దాచి..అదే ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. కొడుకును స్కూల్‌లో జాయిన్‌ చేస్తుంది. 

అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. ఆలోపు  లండన్‌లో ఉన్న వృద్ధురాలి కొడుకు ఇంటికి వస్తాడు. వారిని నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె పోలీసులకు చిక్కుతుంది. మరోవైపు స్కూల్‌కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు.  తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్‌కి తీసుకెళ్తాడు.  అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్‌ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్‌ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్‌ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు?  తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
మలయాళ చిత్రాలకు మన దగ్గర ఎందుకంత ఆదరణ అంటే.. వాళ్ల రాత, తీతలో కొత్తదనం ఉంటుంది. సింపుల్‌ పాయింట్‌ని తీసుకొని దాన్ని హృదయాలకు హత్తుకునేలా తెరపై ఆవిష్కరిస్తారు. సహజత్వానికి పెద్ద పీట వేస్తారు. స్టార్స్‌ని కాకుండా కథను నమ్మి సినిమాలను తీస్తారు. అలా మలయాళ నుంచి వచ్చిన మరో ఆణిముత్యమే ‘బాలన్‌’ అని చెప్పొచ్చు. రాత-తీతలో మలయాళ రచయితలు, దర్శకులు ఎంత కొత్తగా ఆలోచిస్తున్నారో, ట్రెండ్‌కు తగ్గట్లుగా తమని తాము ఎలా కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారో తెలియజేసే సినిమా ఇది. 

వాస్తవానికి ‘బాలన్‌’ కథ పెద్ద గొప్పదేమి కాదు. భర్తను కోల్పోయి కొడుకుతో కలిసి ఒంటరిగా జీవించే ఒక మహిళ.. తమ అస్థిత్వం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇలాంటి కాన్సెప్ట్‌లో గతంలోనూ సినిమాలు వచ్చాయి. అయినా కూడా బాలన్‌ సినిమా చూస్తుంటే అలా కూర్చిలో కూర్చుండిపోతాం. అంతలా ఆకట్టుకుంటుంది స్క్రీన్‌ప్లే. ప్రేక్షకులు అంచనా వేయలేని విధంగా పాత్రల చిత్రణ ఉంటుంది. 

ఫస్టాఫ్‌ మొత్తం ‘తర్వాత ఏం జరుగుతుంది’ అనే అసక్తిని రేకెత్తించేలా సాగుతుంది.  జైలు నుంచి కొడుకుతో తల్లి బయటకు రావడం.. ఆ తర్వాత ఐడెంటిటీని మార్చుకుంటూ ఒక్కో చోటుకు వెళ్తుంటే.. ఎక్కడ వారిని గుర్తుపడతారో అనే టెన్షన్‌తో పాటు, గుర్తు పడితే ఎలా తప్పించుకుటారు?  అనే క్యూరియాసిటీ కూడా ప్రేక్షకుల్లో కలుగుతుంది.  ఇక తల్లి, కొడుకు వేరు అయినప్పుడు.. ఆ బాలుడిని పరిస్థితి చూసి కన్నీళ్లు ఆపుకోలేం. సెకండాఫ్‌లో కొన్ని అనవరమైన సన్నివేశాలతో కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది.  కానీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌.. కథను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. వైవిధ్యమైన సినిమా చూశామనే ఫిలింగ్‌తో ప్రేక్షకుడు థియేటర్‌ నుంచి బయటకు వస్తాడు. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాలో మొదటగా చెప్పుకోవాల్సింది కొడుకు పాత్ర గురించి. ఆ బాలుడిని ఎక్కడ నుంచి పట్టుకోచ్చారో తెలియదు కానీ... అద్భుతంగా నటించాడు. పాత్రకు తగ్గట్లుగా అమాయకత్వంగా కనిపిస్తూ.. కొన్ని చోట్ల కంటతడి పెట్టించాడు. ఇక తల్లిగా ఫర్జానా పాలత్గింగల్‌ తనదైన సహజనటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం తల్లి, కొడుకుల పాత్రల చుట్టే తిరుగుతుంది. అతిథి పాత్రలో టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. అయినప్పటికీ ఆయా పాత్రల్లో బాగానే నటించారు. 

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నేపథ్యం సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత షార్ప్‌గా కట్‌ చేస్తే బాగుండేదేమో.  నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

Rating:
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement