breaking news
Balan Movie
-
ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
చిన్న సినిమాలో థియేటర్స్‌లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచన మలయాళ చిత్రం ‘బాలన్-ది బాయ్’. ‘మంజుమ్మల్ బాయ్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు.ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా జూన్ 19న థియేటర్స్‌లో రిలీజ్ హిట్ టాక్ సంపాదించింది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. బాలన్-ది బాయ్ కథేంటే..ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. రోవైపు స్కూల్‌కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్‌కి తీసుకెళ్తాడు. అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు? తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ఈ వారం హిట్ బొమ్మ ఏది?
ఈ వారం టాలీవుడ్లో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో పాటు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’కూడా ఉంది. వీటితో పాటు యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన లవ్‌స్టోరీ ‘దీవాన’, ‘బిచ్చగాడు’ఫేం విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’, మలయాళ మూవీ ‘బాలన్-ది బాయ్’ సినిమాలు కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల కథేంటి? ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి? పూర్తి రివ్యూస్‌ని ఒక్క క్లిక్‌తో చదివేయండి.1) ‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘దీవాన’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చాం.. సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం : ‘బాలన్’ డైరెక్టర్
‘‘తెలుగు ప్రేక్షులకు ఏ భాష సినిమా అనేది ముఖ్యం కాదు. మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారు. మా ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీపై ప్రేమ చూపించారు. ఇప్పుడు ‘బాలన్ ది బాయ్’ వంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాం. సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని చిదంబరం పేర్కొన్నారు. ఆదిశేషన్, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్ జినాన్, టొవినో థామస్, గిరీష్ ఎ.డి, జీన్ పాల్ లాల్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘బాలన్ ది బాయ్’. చిదంబరం దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మించిన ఈ మూవీ మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. శనివారం నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో చిదంబరం మాట్లాడుతూ– ‘‘నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇష్టం. తెలుగులో ఒక మూవీ చర్చల దశలో ఉంది. ‘బాలన్ ది బాయ్’ని డిస్ట్రిబ్యూట్ చేసిన అన్నపూర్ణ సంస్థకు, ప్రమోట్ చేసిన నాగచైతన్యకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నిర్మాతలుగా మాకు తొలి ప్రయత్నమైనా డైరెక్టర్ చిదంబరం నమ్మి, మా వెంట నిలబడ్డారు’’ అన్నారు శైలజా దేశాయి. -
‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ
టైటిల్ : బాలన్- ది బాయ్నటీనటులు : ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్, జీన్ పాల్ లాల్, గిరిష్ ఏడి తదితరులుదర్శకత్వం : చిదంబరంనిర్మాతలు : వెంకట్ కె నారాయణ, షైల్జా దేశీ ఫెన్సంగీతం : సుషిన్ శ్యామ్‌సినిమాటోగ్రఫీ: షిజు ఖలీద్ఎడిటర్: వివేక్ హర్షన్ఈ వారం సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో పాటు నాలుగైదు సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి మలయాళ మూవీ కూడా ఉది. అదే ‘బాలన్-ది బాయ్’. ‘మంజుమ్మల్ బాయ్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. కొడుకుకు ప్రతిసారి ఒక కథ చెబుతూ.. ఎవరు అడిగినా తాను చెప్పినట్లుగానే చెప్పాలని ట్రైనింగ్ ఇస్తుంది. ఆరేళ్ల ఆ బాలుడు తల్లి చెప్పినట్లుగానే చేస్తాడు. అలా తమ ఐడెంటిటీని మారుస్తూ పలు ఊర్లు తిరిగి.. చివరకు ఒక వృద్ధురాలి దగ్గర కేర్ టేకర్‌గా చేరుతారు. కొన్నాళ్ల తర్వాత ఆమె చనిపోతుంది. అ విషయాన్ని లండన్‌లో ఉన్న ఆమె కొడుకు దగ్గర దాచి..అదే ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. కొడుకును స్కూల్లో జాయిన్ చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. ఆలోపు లండన్‌లో ఉన్న వృద్ధురాలి కొడుకు ఇంటికి వస్తాడు. వారిని నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె పోలీసులకు చిక్కుతుంది. మరోవైపు స్కూల్‌కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్‌కి తీసుకెళ్తాడు. అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు? తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మలయాళ చిత్రాలకు మన దగ్గర ఎందుకంత ఆదరణ అంటే.. వాళ్ల రాత, తీతలో కొత్తదనం ఉంటుంది. సింపుల్ పాయింట్‌ని తీసుకొని దాన్ని హృదయాలకు హత్తుకునేలా తెరపై ఆవిష్కరిస్తారు. సహజత్వానికి పెద్ద పీట వేస్తారు. స్టార్స్‌ని కాకుండా కథను నమ్మి సినిమాలను తీస్తారు. అలా మలయాళ నుంచి వచ్చిన మరో ఆణిముత్యమే ‘బాలన్’ అని చెప్పొచ్చు. రాత-తీతలో మలయాళ రచయితలు, దర్శకులు ఎంత కొత్తగా ఆలోచిస్తున్నారో, ట్రెండ్‌కు తగ్గట్లుగా తమని తాము ఎలా కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారో తెలియజేసే సినిమా ఇది. వాస్తవానికి ‘బాలన్’ కథ పెద్ద గొప్పదేమి కాదు. భర్తను కోల్పోయి కొడుకుతో కలిసి ఒంటరిగా జీవించే ఒక మహిళ.. తమ అస్థిత్వం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇలాంటి కాన్సెప్ట్‌లో గతంలోనూ సినిమాలు వచ్చాయి. అయినా కూడా బాలన్ సినిమా చూస్తుంటే అలా కూర్చిలో కూర్చుండిపోతాం. అంతలా ఆకట్టుకుంటుంది స్క్రీన్‌ప్లే. ప్రేక్షకులు అంచనా వేయలేని విధంగా పాత్రల చిత్రణ ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం ‘తర్వాత ఏం జరుగుతుంది’ అనే అసక్తిని రేకెత్తించేలా సాగుతుంది. జైలు నుంచి కొడుకుతో తల్లి బయటకు రావడం.. ఆ తర్వాత ఐడెంటిటీని మార్చుకుంటూ ఒక్కో చోటుకు వెళ్తుంటే.. ఎక్కడ వారిని గుర్తుపడతారో అనే టెన్షన్‌తో పాటు, గుర్తు పడితే ఎలా తప్పించుకుటారు? అనే క్యూరియాసిటీ కూడా ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక తల్లి, కొడుకు వేరు అయినప్పుడు.. ఆ బాలుడిని పరిస్థితి చూసి కన్నీళ్లు ఆపుకోలేం. సెకండాఫ్‌లో కొన్ని అనవరమైన సన్నివేశాలతో కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్.. కథను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. వైవిధ్యమైన సినిమా చూశామనే ఫిలింగ్తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వస్తాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో మొదటగా చెప్పుకోవాల్సింది కొడుకు పాత్ర గురించి. ఆ బాలుడిని ఎక్కడ నుంచి పట్టుకోచ్చారో తెలియదు కానీ... అద్భుతంగా నటించాడు. పాత్రకు తగ్గట్లుగా అమాయకత్వంగా కనిపిస్తూ.. కొన్ని చోట్ల కంటతడి పెట్టించాడు. ఇక తల్లిగా ఫర్జానా పాలత్గింగల్ తనదైన సహజనటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం తల్లి, కొడుకుల పాత్రల చుట్టే తిరుగుతుంది. అతిథి పాత్రలో టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. అయినప్పటికీ ఆయా పాత్రల్లో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నేపథ్యం సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత షార్ప్‌గా కట్ చేస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
తెలుగు ప్రేక్షకులంటే అందరికీ చులకనే!
టికెట్ కొని వెళ్లే ప్రేక్షకులంటే హీరోలు, దర్శకనిర్మాతలకు కనీస గౌరవం ఉండాలి. కానీ గత కొన్నాళ్లుగా చూస్తే మాత్రం అది చాలా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్గా 'బాలన్' ట్రైలరే దీనికి మరో ఉదాహరణ. 'మంజుమ్మల్ బాయ్స్' దర్శకుడు తీసిన కొత్త మూవీ ఇది. తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు కానీ టాలీవుడ్ ఆడియెన్స్ అంటే ఏం చూపించినా చూస్తారులే అని డబ్బింగ్ వింటేనే అర్థమవుతోంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)మంజుమ్మల్ బాయ్స్ సినిమా తీసిన దర్శకుడు.. జన నాయగణ్, టాక్సిక్ మూవీస్ తీసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ దీన్ని నిర్మించింది. విజువల్స్, స్టోరీ బాగున్నాయి. కానీ తెలుగు డబ్బింగే దారుణంగా చేశారు. గూగుల్ ట్రాన్స్లేటర్లో కాపీ చేసి డబ్బింగ్ చేశారా అనే సందేహం కలుగుతోంది. ట్రైలర్‌లోని కంటెంట్ ఆసక్తిగా అనిపించినప్పటికీ.. తెలుగు డబ్బింగ్ ఆ ఆసక్తిని మొత్తం తగ్గించేసినట్లు అనిపించింది.వచ్చే శుక్రవారం(జూన్ 19) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మూవీ రిలీజ్ నాటికైనా డబ్బింగ్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తే సరేసరి. లేదంటే మాత్రం విమర్శలు తప్పవు. ఇదే కాదు టైటిల్ కూడా 'బాలన్' అని ఉన్నది ఉన్నట్లు పెట్టేశారు.ట్రైలర్ బట్టి చూస్తే.. సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక తల్లి.. ఆ తల్లి ఏం చేస్తుందో తెలియని ఒక పిల్లాడు. అనుకోకుండా ఆ పిల్లాడు కనిపించకుండాపోవడం.. అతడి కోసం పోలీసులు వెతకడం.. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రజనీకాంత్ సినిమా.. ఇంకెంతమంది మారతారో ఏంటో?)


