ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.. | Balan : The Boy Movie OTT RElease Date Out | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Jul 18 2026 1:27 PM | Updated on Jul 18 2026 1:54 PM

Balan : The Boy Movie OTT RElease Date Out

చిన్న సినిమాలో థియేటర్స్‌లో రిలీజ్‌ అయి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచన మలయాళ చిత్రం ‘బాలన్‌-ది బాయ్‌’.  ‘మంజుమ్మల్‌ బాయ్స్’తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు.ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్‌, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు.  

తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా జూన్‌ 19న థియేటర్స్‌లో రిలీజ్‌ హిట్‌ టాక్‌ సంపాదించింది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది. 

బాలన్‌-ది బాయ్‌ కథేంటే..
ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్‌)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్‌) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. రోవైపు స్కూల్‌కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు.

 తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్‌కి తీసుకెళ్తాడు.  అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్‌ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్‌ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్‌ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు?  తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement