డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చాం.. సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాం : ‘బాలన్‌’ డైరెక్టర్‌ | Director Chidambaram Talk About Balan The Boy | Sakshi
Sakshi News home page

మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు

Jun 21 2026 8:56 AM | Updated on Jun 21 2026 11:15 AM

Director Chidambaram Talk About Balan The Boy

‘‘తెలుగు ప్రేక్షులకు ఏ భాష సినిమా అనేది ముఖ్యం కాదు. మంచి కంటెంట్‌ ఉంటే ఆదరిస్తారు. మా ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ మూవీపై ప్రేమ చూపించారు. ఇప్పుడు ‘బాలన్‌ ది బాయ్‌’ వంటి ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాం. సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాం’’ అని చిదంబరం పేర్కొన్నారు. ఆదిశేషన్, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్‌ జినాన్, టొవినో థామస్, గిరీష్‌ ఎ.డి, జీన్‌ పాల్‌ లాల్‌ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘బాలన్‌ ది బాయ్‌’. చిదంబరం దర్శకత్వంలో వెంకట్‌ కె. నారాయణ, శైలజా దేశాయి ఫెన్‌ నిర్మించిన ఈ మూవీ మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ డిస్ట్రిబ్యూట్‌ చేసింది. శనివారం నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో చిదంబరం మాట్లాడుతూ– ‘‘నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇష్టం. తెలుగులో ఒక మూవీ చర్చల దశలో ఉంది. ‘బాలన్‌ ది బాయ్‌’ని డిస్ట్రిబ్యూట్‌ చేసిన అన్నపూర్ణ సంస్థకు, ప్రమోట్‌ చేసిన నాగచైతన్యకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నిర్మాతలుగా మాకు తొలి ప్రయత్నమైనా డైరెక్టర్‌ చిదంబరం నమ్మి, మా వెంట నిలబడ్డారు’’ అన్నారు శైలజా దేశాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement