వెండితెరపైనే కాదు బిజినెస్‌లోనూ హీరోనే.. | Hrithik Roshan Commercial Real Estate Deal Rs 17 Lakh Monthly Rent In Mumbai, Set To Earn Over Rs 10 Crore | Sakshi
Sakshi News home page

వెండితెరపైనే కాదు బిజినెస్‌లోనూ హీరోనే..

Aug 4 2026 7:58 AM | Updated on Aug 4 2026 10:28 AM

Hrithik Roshan Commercial Real Estate Deal Rs 17 Lakh Monthly Rent in Mumbai

సినిమా వెండితెరపైనే కాదు.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోనూ బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్ తన సత్తా చాటుతున్నారు. తాజాగా ముంబైలోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతంలో తన ఆఫీస్ స్పేస్‌ను భారీ అద్దెకు లీజుకు ఇచ్చి వ్యాపార వర్గాల దృష్టిని ఆకర్షించారు.

డీల్ వివరాలు ఇవే..

రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ ప్రకారం.. ముంబై అంధేరి వెస్ట్‌లోని న్యూ లింక్ రోడ్డులో ఉన్న లోటస్ నీలకమల్ బిజినెస్ పార్క్‌లోని తన వాణిజ్య ఆస్తిని ‘క్లియర్ సింత్ ల్యాబ్స్ లిమిటెడ్’కు హృతిక్ లీజుకు ఇచ్చారు. దీని విస్తీర్ణం దాదాపు 6,000 చదరపు అడుగులు (7 ప్రత్యేక పార్కింగ్ స్లాట్లతో కలిపి). ఏప్రిల్ 1, 2026-మార్చి 31, 2029 వరకు మొదటి మూడేళ్లకు నెలకు రూ.17 లక్షలు అద్దెగా నిర్ణయించారు. నాలుగో ఏడాది (ఏప్రిల్ 1, 2029) నుంచి 15 శాతం పెరుగుదలతో నెలకు రూ. 19.55 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లీజు గడువు మార్చి 31, 2031తో ముగుస్తుంది. ఈ ఐదేళ్ల డీల్ కోసం అద్దెదారు రూ.68 లక్షల డిపాజిట్ చెల్లించినట్లు సమాచారం.

కోట్లాది రూపాయల రాబడి

ఈ ఐదేళ్ల లీజు ఒప్పందం ద్వారా హృతిక్ రోషన్‌కు రూ.10 కోట్లకు పైగానే నికర అద్దె ఆదాయం సమకూరనుంది. కేవలం క్యాపిటల్ వాల్యూ పెరగడమే కాకుండా నెలవారీగా స్థిరమైన ఆదాయాన్ని అందించే వాణిజ్య ఆస్తుల వైపు సెలబ్రిటీలు ఆకర్షితులవుతున్నారనడానికి ఈ డీల్ నిదర్శనం.

సినిమాల విషయానికి వస్తే..

గత ఏడాది వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' (2025)లో అలరించిన హృతిక్ ఇటీవలే విడుదలైన ‘ఆల్ఫా’ (జులై 2026) చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశారు. ఒకవైపు స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూనే మరోవైపు వ్యూహాత్మక పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ బాలీవుడ్ స్మార్ట్ ఇన్వెస్టర్‌గా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement