షాకిచ్చిన సూర్య-జ్యోతిక.. ఏఐ కాదు నిజమే | Suriya And Jyothika Latest Photos Viral | Sakshi
Sakshi News home page

Suriya Jyothika: వీళ్లకు వయసు పెరుగుతోందా? తగ్గుతోందా?

Aug 3 2026 2:31 PM | Updated on Aug 3 2026 2:39 PM

Suriya And Jyothika Latest Photos Viral

డైట్, గ్లామర్ మెంటైన్ చేయాలంటే సామాన్యులకు కష్టం గానీ సెలబ్రిటీలకు చాలా సింపుల్. ఎందుకంటే కొందరు 50-60 ఏళ్లొచ్చినా సరే యంగ్‌గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. ఇప్పుడు సెలబ్రిటీ జంట సూర్య-జ్యోతిక కూడా అలానే షాకిచ్చారు. వీళ్లు కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

గత 30 ఏళ్లుగా నటుడిగా చేస్తున్న సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వచ్చే వారం ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో ఓ పక్క బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు భార్యతో కలిసి ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు. బ్లాక్ అండ్ వైట్, కలర్ గ్రేడింగ్‌తో ఉన్న ఈ ఫొటోల్లో డిజైనర్ దుస్తుల్లో వీళ్లిద్దరూ కనువిందు చేశారు. ఇవి చూసిన చాలామంది వీళ్లకు వయసు తగ్గుతోందా? అని మాట్లాడుకుంటున్నారు.

సూర్య సినిమాలతో బిజీగా ఉండగా జ్యోతిక కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో హిందీలో మూవీస్ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె 'సిస్టమ్' అనే వెబ్ సిరీస్ చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న దీనితో సక్సెస్ అందుకుంది.

(ఇదీ చదవండి: మెడలో తాళితో 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement