breaking news
M.S raju
-
‘ఎన్టీఆర్ చికెన్’ కామెంట్స్‌పై ఎంఎస్ రాజు క్లారిటీ
‘అగధ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్ రాజు చేసిన ‘చికెన్’ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్స్ ఎం.ఎస్ రాజుని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ ‘చికెన్’ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్‌పై అంతులేని అభిమానంతోనే ఆ మాటలు అన్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పాడు.ప్రీరిలీజ్ ఈవెంట్ ఎం.ఎస్ రాజు ఏమన్నారంటే.. ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాడని చెప్పాడు. తను పడిన కష్టం గురించి చెబుతూ..‘ఏడాదిన్నర పాటు ఎన్టీ రామారావు గారిలాగే నేను కూడా ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. ఆయనలాగా చికెన్ తినలేదు కానీ.. నేనే పాలు కాచుకొని తాగుదాం అనుకుంటే నా భార్యలేచి కాఫీ పెట్టి ఇచ్చేది. అక్కడ నుంచి మొదలెడితే అర్థరాత్రి వరకు సినిమా గురించే ఏదో ఒక పని చేసేవాడిని’అని చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌లాగా చికెన్ తినలేదని వ్యంగ్యంగా అనడాన్ని కొంతమంది నెటిజన్స్ తప్పుపట్టారు. ఎం.ఎస్ రాజుని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేశారు.అభిమానంతోనే అలా.. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. రామారావుగారిపై ఉన్న అభిమానంతోనే అలా అన్నానని చెప్పాడు. ‘నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. పొద్దున లేవగానే వ్యాయామం చేసేవాడు. ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ చేసి.. తినడానికి వెళ్లేవాడు. పక్కనే మేము ఉంటే కూడా తినడానికి తీసుకెళ్లేవాడు. మాకు కూడా గారెలు, చికెన్ తెప్పించే వాళ్ళు. ఆయన ఒక మంచి కోడిని ఎదురుగా పెట్టుకొని తినేవాళ్లు. నేను జరిగిందే చెప్తున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ అయ్యేది అప్పట్లో సోషల్ మీడియా ఉంటే. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనలా ఉండాలి అని అనుకున్నాను. ఆయనలా ఉదయాన్నే లేచి పూజ చేసుకొని సినిమా చేశాను చికెన్ ఒక్కటే తినలేదు కాబట్టి ఆ మాట చెప్పాను అంతే. రామారావు గారి మీదున్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలు నేను సరదాగా అన్నాను. మా నాన్న గారు, రామారావు గారికి మంచి అనుబంధం ఉంది. మా నాన్న గారికి రామారావు గారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చివరి నిమిషంలో ఎన్నికల వల్ల మిస్ అయింది. ఆయన నిబద్దత, క్రమశిక్షణను దగ్గర్నుండి చూశాను. ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం నన్ను ట్రోల్ చేయదు. మిగతా ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు’ అని ఎం.ఎస్ రాజు అన్నారు. ‘అగధ’ విషయానికొస్తే.. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటా : ఎం.ఎస్ రాజు
‘‘ఇంతకుముందు నేను చేయని కథల్ని ఇప్పుడు ప్రయత్నించాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు గాలి సోకిందని కొన్ని రోజులు స్కూల్ మాన్పించారు. ఆ ఘటన నా మదిలో అలా ఉండిపోయింది. ‘అగధ’ సినిమా చేయడానికి ఇది కూడా ఒక కారణం. యూత్, జెన్ జీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నా ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేశాం’’ అని ఎం.ఎస్ రాజు అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, భాను చందర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ కేఆర్ సమర్పణలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కేవీఎల్ఎన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ–‘‘ఒక్కడు’ సినిమాకి మహేశ్ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’కి సిద్ధార్థ్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్ కిరణ్ కరెక్ట్‌గా యాప్ట్ అయ్యారు. అలా ‘అగధ’ కి ఇందులో నటించిన వారంతా కరెక్ట్‌గా సరిపోయారు. నాకు రిటైర్ అవడం ఇష్టం ఉండదు. నా శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను’’ అన్నారు. -
ఇది అలాంటి సినిమా కాదు!
‘‘శృంగారానికి, బూతుకు చాలా తేడా ఉంది. ‘డర్టీ హరి’ అనేది ఎం. ఎస్. రాజు ఫిల్మ్. బూతు ఫిల్మ్ కాదు. ఈ సినిమాలో మంచి హ్యూమన్ డ్రామా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ– ‘‘నాకు క్లీన్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉంది. కానీ ఒక బోర్డర్ దాటి నేను ‘డర్టీ హరి’ లాంటి సినిమాను ఎందుకు తీయాల్సి వచ్చిందనే విషయం ఈ నెల 18న తెలుస్తుంది. ఎం.ఎస్. రాజు వివాదాస్పద సినిమా తీశారేంటి? అనుకునేవారికి సమాధానం దొరుకుతుంది’’ అన్నారు. ‘‘ఇది మంచి ఎంటర్టైనింగ్ మూవీ’’ అన్నారు శ్రవణ్. ‘‘నా ముందు సినిమాలో నేను సంప్రదాయంగా ఉండే పాత్ర చేశాను. కానీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలి. వందశాతం కష్టపడాలని మా అమ్మగారు అనడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు సిమ్రత్ కౌర్. ‘‘ఇదొక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్’’ అన్నారు నిర్మాత వంశీ. ‘‘మా ఫ్రైడే మూవీస్ యాప్‌లో ప్రతి శుక్రవారం ఓ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ‘డర్టీ హరి’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు విజయ్. ఈ కార్యక్రమంలో కేదార్, మదన్, భాస్కర్, అనురాగ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
‘వెల్కమ్ టు అమెరికా’ ఆడియో ఆవిష్కరణ


