ఏఐ కల్చర్ పెరిగిపోయిన తర్వాత దానిని మంచి కోసం ఎంతమంది ఉపయోగిస్తున్నారో అనే సంగతి పక్కనబెడితే సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టేందుకు విరివిగా వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి అవన్నీ నిజమనే భ్రమ కల్పిస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితుల బారిన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకుర్ పడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి)
'నా డీప్ ఫేక్ ఫొటోలని సృష్టించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే డిలీట్ చేయండి లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని మృణాల్ హెచ్చరించింది.
మృణాల్ ఇప్పుడు కోప్పడటం కాదు గానీ గతంలో రష్మిక తదితర హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. పలువురు నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా సరే ఇలాంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం హీరోయిన్లని ఇబ్బందులకు గురిచేస్తోంది. మృణాల్ కెరీర్ విషయానికొస్తే..రీసెంట్‌గా ఓ హిందీ మూవీ చేసింది గానీ సరిగా ఆడలేదు.
(ఇదీ చదవండి: 200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్‌బస్టర్: హీరో సూర్య)


