breaking news
Kamakshi Bhaskarla
-
సోషల్ మీడియా క్రేజ్.. ఏకంగా మూవీ ప్రమోషన్లలో కుమారి ఆంటీ!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో సోషల్ మీడియా వల్ల ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అలాంటి వారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీ, కుర్చీ తాత, మోనాలిసా ఇలా ఎందరో ఉన్నారు. హైదరాబాద్‌లో రోడ్డు పక్కన్ భోజనాలు విక్రయించే కుమారి ఆంటీ ఓకే ఒక్క మాటతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.అదే ఫేమ్‌తో ఇప్పుడు ఏకంగా మూవీ ప్రమోషన్లలో భాగమయ్యారు కుమారి ఆంటీ. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా షో టైమ్ ప్రమోషన్లలో సందడి చేశారు. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్‌తో ఆమె ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కుమారి ఆంటీ ప్రమోషన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
నవీన్ చంద్ర ‘షో టైమ్’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని: పొలిమేర హీరోయిన్
పొలిమేర సినిమాలతో ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ఆమె షో టైమ్ అనే మూవీలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేసింది.తాను జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానినని కామాక్షి భాస్కర్ల అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్‌గా అరవింద సమేత సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లి.. నవీన్ చంద్ర అభిమానిగా బయటికొచ్చానని తెలిపింది. పొలిమేర-2 చూసిన తర్వాత నవీన్ చంద్ర వ్యక్తిగతంగా నన్ను అభినందించారు. ఈ సినిమాలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.. ఈ విషయంలో నవీన్ చంద్రతో పాటు డైరెక్టర్‌కు నా ధన్యవాదాలు.. మా సినిమాలను ఓటీటీలో కాకుండా థియేటర్లకు వచ్చి చూడాలని ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేసింది కామాక్షి భాస్కర్ల. -
డబ్బులు పంపిస్తామని యూపీఐ నంబర్ అడిగారు: నవీన్ చంద్ర
టాలీవుడ్ నవీన్ చంద్ర వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నవీన్ చంద్ర.. షో టైమ్ అంటూ మరోసారి రెడీ అయిపోయారు. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నవీన్.. అలాంటి కథతోనే మన ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూన్ 13న తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయని తెలిపారు. ఆ రోజు నా జీవితంలో చాలా అద్భుతమైన రోజని అన్నారు. ఎక్కడో బళ్లారి నుంచి మీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నానని తెలిపారు. నా కెరీర్లో సక్కెస్ అయినా.. ఫెయిల్యూర్ అయినా ఇండస్ట్రీలోనే ఉంటానని అన్నారు.చాలామంది మీ సినిమాలు థియేటర్లలో మిస్సయ్యాం.. మీ నిర్మాత యూపీఐ నెంబర్ పెట్టమని చాలామంది అడిగారని వెల్లడించారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అంటూ నవీన్ చంద్ర మాట్లాడారు. షో టైమ్ మూవీని థియేటర్లకు వచ్చి చూడండి.. మిమ్మల్ని డిస్సపాయింట్ చేయదు అంటూ ఆడియన్స్‌కు రిక్వెస్ట్ చేశారు నవీన్ చంద్ర. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం చేస్తున్నారు. తాజాగా ఉగాది పండుగను సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.తాజా పోస్టర్ చూస్తుంటే ఈ మూవీని ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కథగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నవీన్ చంద్ర గతంలో కూడా చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పోలిమేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. A family on edge.A cop at the door.And a story that’s about to explode💥Welcome to #SHOWTIME – First Look is out now!🌟ing @Naveenc212 #kamakshibhaskarla@SkylineMoviez @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop @gavireddy_srinu… pic.twitter.com/O2FSZA6IOt— Skyline Movies (@SkylineMoviez) March 30, 2025 -
ఒకేసారి మూడు సినిమాలు.. పొలిమేర బ్యూటీ ఫుల్ బిజీ (ఫోటోలు)
-
వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న 'పొలిమేర' నటి
కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ఎంచుకునే భిన్న స్క్రిప్ట్‌లు ఎంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీతో బిజీగా ఉంది. మరో వైపు బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. తాజాగా కామాక్షి మాట్లాడుతూ.. ‘మూడు చిత్రాలలో నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను. ఈ మూడు ప్రాజెక్టులు నా కెరీర్‌కు చాలా కీలకం కానున్నాయి. ఇలా ఒకే టైంలో మూడు ప్రాజెక్టులకు పని చేయడం కష్టమైనప్పటికీ, సినిమా పట్ల ఉన్న ప్యాషన్, ప్రేమ వల్ల కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నాకు సినిమా సెట్లలో ఉండటమే నచ్చుతుంది’ అని పేర్కొంది.ప్రతిసారి డిఫరెంట్ పాత్రలను పోషిస్తుండటంపై కామాక్షి స్పందిస్తూ.. ‘సినిమాలోని పాత్రకు కనెక్ట్ అవ్వడం, ఆ క్యారెక్టర్‌కు నిజాయితీగా పని చేయడం వల్ల యాక్టర్ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలరు. సవాల్‌గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే నేను ఎంచుకుంటూ వస్తున్నాను. స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగానే పని చేస్తున్నాను. నా కోసం పాత్రలు రాసే దర్శకులకే క్రెడిట్ ఇస్తాను. నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే. ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణం అని నమ్ముతాను’ అని తెలిపింది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి -
తేళ్లు, బొద్దింకలు తింటాను: తెలుగు హీరోయిన్
డాక్టర్ అవ్వబోయి యాక్టర్లు అయిన నటీనటులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కానీ డాక్టర్లుగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) ఒకరు. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేసిన ఈ తెలుగమ్మాయి.. కొన్నాళ్ల తర్వాత వైద్యవృత్తిని వదిలేసి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మా ఊరి పొలిమేర చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. విరూపాక్ష, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పొలిమేర 2 తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. (చదవండి: రీరిలీజ్‌తో రూ.50కోట్ల కలెక్షన్లు.. తొలి చిత్రంగా రికార్డు!)అయితే నటిగా మాత్రమే కామాక్షి అందరికి తెలుసు. ఆమె డాక్టర్ అని, ఆరేళ్ల పాటు చైనాలోనే ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి, తన ఆహార అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది కామాక్షి. ‘చైనాలో ఆరేళ్ల పాటు ఉన్నాను. నాకు వంటలు చేయడం వచ్చు. గదిలోనే నేను వంట చేసుకొని తినేదాన్ని. అయితే చైనా ఫుడ్ రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒకటి రెండు సార్లు ఆ ఫుడ్ తిన్నాను. బొద్దింకలు, తేళ్లు వంటివి రుచి చూశాను(నవ్వుతూ..). నేను ఒక్కడికి వెళ్లినా.. అక్కడ వంటకాలు ట్రై చేస్తాను. అందులో భాగంగానే చైనా ఫుడ్ తిన్నాను’ అని కామాక్షి చెప్పుకొచ్చింది. అంతేకాదు చైనా వాళ్లు బొద్దింకలు, పాములు, తేళ్లను ఎందుకు తింటారో కూడా వివరించింది. కొన్నేళ్ల క్రితం చైనాలో మనలాగా గ్రీనరీ ఉండేది కాదనీ.. తినడానికి కూరగాయలు దొరకని పరిస్థితుల్లో ఇలా కనిపించిన జీవుల్ని చంపి తినడం అలవాటైందని మీనాక్షి చెప్పుకొచ్చింది.ఇక ఇండస్ట్రీలొకి వచ్చిన తర్వాత తనలో జరిగిన మార్పుల గురించి చెబుతూ..‘నాకు 22 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా బయట ప్రపంచం తెలియదు. నా ఫీలింగ్స్ నేను ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని కాదు. . కష్టమైనా.. నష్టమైనా.. సంతోషమైన ఇతరులతో పంచుకోవడానికి కాస్త ఆలోచించేదాన్ని. కాలేజ్ కి వెళ్లే సమయంలో కూడా ఇల్లు, కాలేజ్ ఇంతే నాకు తెలిసిన ప్రపంచం. అయితే ఒక్కసారిగా ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనిపించింది. అక్కడే నా ఆలోచన నన్ను పూర్తిగా మార్చేసింది. ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, సుస్మీతాసేన్ వంటి వారిలా తాను తమను తాము ప్రూవ్ చేసుకొని, ఇతర మహిళలను కూడా ఎంకరేజ్ చేసేవారు. ఇక అప్పుడే నాకనిపించింది. నేను కూడా ఆ పొజిషన్లో ఉండాలి. నాలాగా తమ అభిప్రాయాలను బయటకి చెప్పుకోలేని అమ్మాయిలకు అండగా నిలవాలి అని నేను కూడా అనుకున్నాను. ఇక అలా నా ఆలోచనలు ఒక్కొక్కటిగా మారుతూ వచ్చాయి’ అని కామాక్షి చెప్పుకొచ్చింది.