డబ్బులు పంపిస్తామని యూపీఐ నంబర్ అడిగారు: నవీన్ చంద్ర | Naveen Chandra Latest Movie SHOW TIME Official Trailer | Sakshi
Sakshi News home page

Naveen Chandra: డబ్బులు పంపిస్తామని యూపీఐ నంబర్ అడిగారు: నవీన్ చంద్ర

Jun 24 2025 3:28 PM | Updated on Jun 24 2025 4:07 PM

Naveen Chandra Latest Movie SHOW TIME Official Trailer

టాలీవుడ్ నవీన్ చంద్ర వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే బ్లైండ్ స్పాట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నవీన్ చంద్ర.. షో టైమ్‌ అంటూ మరోసారి రెడీ అయిపోయారు. థ్రిల్లర్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నవీన్‌.. అలాంటి కథతోనే మన ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూన్‌ 13న తన మూడు సినిమాలు రిలీజ్‌ అయ్యాయని తెలిపారు. ఆ రోజు నా జీవితంలో చాలా అద్భుతమైన రోజని అన్నారు. ఎక్కడో బళ్లారి నుంచి మీ వల్లే నేను ఈ పొజిషన్‌లో ఉన్నానని తెలిపారు. నా కెరీర్‌లో సక్కెస్ అయినా.. ఫెయిల్యూర్‌ అయినా ఇండస్ట్రీలోనే ఉంటానని అన్నారు.

చాలామంది మీ సినిమాలు థియేటర్లలో మిస్సయ్యాం.. మీ నిర్మాత యూపీఐ నెంబర్ ‍పెట్టమని చాలామంది అడిగారని వెల్లడించారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అంటూ నవీన్ చంద్ర మాట్లాడారు. షో టైమ్‌ మూవీని థియేటర్లకు వచ్చి చూడండి.. మిమ్మల్ని డిస్సపాయింట్‌ చేయదు అంటూ ఆడియన్స్‌కు రిక్వెస్ట్ చేశారు నవీన్ చంద్ర. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement