జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని: పొలిమేర హీరోయిన్ | Polimera Actress Kamakshi Bhaskarla comments about Jr Ntr | Sakshi
Sakshi News home page

Kamakshi Bhaskarla: 'ఎన్టీఆర్‌ అభిమానిగా వెళ్లి.. నవీన్ చంద్ర ఫ్యాన్‌గా తిరిగొచ్చా'

Jun 24 2025 4:02 PM | Updated on Jun 24 2025 4:13 PM

Polimera Actress Kamakshi Bhaskarla comments about Jr Ntr

పొలిమేర సినిమాలతో ఆడియన్స్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ఆమె షో టైమ్ అనే మూవీలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కామాక్షి భాస్క‍ర్ల ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తాను జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానినని కామాక్షి భాస్కర్ల అన్నారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్‌గా అరవింద సమేత సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లి.. నవీన్ చంద్ర అభిమానిగా బయటికొచ్చానని తెలిపింది. పొలిమేర-2 చూసిన తర్వాత నవీన్ చంద్ర వ్యక్తిగతంగా నన్ను అభినందించారు. ఈ సినిమాలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.. ఈ విషయంలో నవీన్ చంద్రతో పాటు డైరెక్టర్‌కు నా ధన్యవాదాలు.. మా సినిమాలను ఓటీటీలో కాకుండా థియేటర్లకు వచ్చి చూడాలని ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేసింది కామాక్షి భాస్కర్ల. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement