ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే ఈ వారం కూడా జైలర్ 2, రణబాలి, దాయిరా, పుష్పక విమానం, పరివారిక్ మనురంజన్ లాంటి మూవీస్, సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడీ లిస్టులోకి మరో తెలుగు ఎమోషనల్ అడ్వెంచర్ చిత్రం వచ్చి చేరింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)
వేర్వేరు వయసున్న మహిళలు పలువురు కలిసి ఒకేసారి ఫారిన్ ట్రిప్‌కు వెళితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన సినిమా ‘హ్యాపీ జర్నీ’. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి వచ్చింది. సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ తదితరులు తప్పితే పేరున్న యాక్టర్స్ లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడిది ఈ శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దక్షిణాది భాషల్లో అందుబాటులోకి రానుంది.
'హ్యాపీ జర్నీ' విషయానికొస్తే.. సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునయన), విహాన (రూప శ్రీనివాస్).. ఇలా వివిధ సామాజిక వర్గాలు, వేర్వేరు వయసున్న ఏడుగురు మహిళలకు ఒక లక్కీ డ్రాలో యూరప్ వెళ్లే అవకాశం దక్కుతుంది. గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్ ఏజెన్సీని నడిపే గోవింద్ (వంశీ), అప్పారావు (రవి శివతేజ) వీరికి గైడ్స్. ఒక సరదా వెకేషన్‌లా మొదలైన వీరి ట్రిప్.. మెల్లగా ఒకరికొకరు అర్థం చేసుకునే ఎమోషనల్ జర్నీగా ఎలా మారింది? ఈ ప్రయాణంలో వాళ్లు తమ జీవితాల గురించి తెలుసుకున్న నిజాలేంటి? విడిపోయిన వారి కుటుంబాలు మళ్లీ ఎలా కలిశాయి? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)


