అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది | Allari Naresh Latest Movie 12A Railway Colony Trailer Out Now | Sakshi
Sakshi News home page

12A Railway Colony Trailer: అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది

Nov 11 2025 4:53 PM | Updated on Nov 11 2025 5:15 PM

Allari Naresh Latest Movie 12A Railway Colony Trailer Out Now

కామెడీ సినిమాలతో అభిమానులను అలరించిన హీరో అల్లరి నరేశ్. అయితే గత కొంతకాలంగా తన ట్రెండ్‌కు భిన్నంగా మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఉగ్రం, బచ్చలమల్లి చిత్రాలతో తన ట్రాక్‌ మార్చాడు. అయితే ఈ చిత్రాలేవీ ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా మళ్లీ అదే ట్రాక్‌లో వెళ్తున్నారు. ఈ సారి మాస్‌కు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని  నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం నవంబర్  21న థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం మర్డర్ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది.  ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement