పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ సూర్యకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఇతడికి చాలా ఫాలోయింగ్ ఉంది. గతంలో 'రక్తచరిత్ర 2' అనే తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో నటించాడు గానీ పూర్తిస్థాయిలో తెలుగు మూవీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు 'సార్', 'లక్కీ భాస్కర్' దర్శకుడు తీస్తున్న సినిమా చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుందని తెలుసు గానీ కాన్సెప్ట్ ఏంటనేది బయటకు రాలేదు. ఇప్పుడు స్వయానా నిర్మాత నాగవంశీ.. స్టోరీ కాస్త రివీల్ చేశారు.
(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్)
ఈ మూవీలో హీరో సూర్య.. 'గజిని'లో సంజయ్ రామస్వామిలా ఓ ధనవంతుడు. అతడి వయసు 45 ఏళ్లు. అలాంటి ఇతడు 20 ఏళ్ల అమ్మాయి(మమిత)తో ప్రేమలో పడతాడు. వీళ్ల మధ్య స్నేహం, ప్రేమ, కోపం.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ల మధ్య ఉన్నది ప్రేమా కాదా అనేది స్టోరీ పాయింట్ అని నాగవంశీ చెప్పుకొచ్చారు. చూస్తుంటే సూర్య.. ఈసారి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
సూర్య గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాల చూస్తే చాలావరకు యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఓ లవ్ స్టోరీ అని తెలిసి తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. వెంకీ అట్లూరి తీస్తున్న ఈ సినిమాలో సూర్య, మమిత బైజుతో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్ర చేస్తోంది. మరో రెండు మూడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వచ్చే వేసవిలో లేదంటే వేసవి చివరలో థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
(ఇదీ చదవండి: 'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్)


