అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
కామెడీ సినిమాలతో అభిమానులను అలరించిన హీరో అల్లరి నరేశ్. అయితే గత కొంతకాలంగా తన ట్రెండ్‌కు భిన్నంగా మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఉగ్రం, బచ్చలమల్లి చిత్రాలతో తన ట్రాక్ మార్చాడు. అయితే ఈ చిత్రాలేవీ ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా మళ్లీ అదే ట్రాక్‌లో వెళ్తున్నారు. ఈ సారి మాస్కు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.తాజాగా అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం మర్డర్ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు.