అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అల్లరి నరేశ్ మాట్లాడుతూ..'ఇప్పటివరకూ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీస్ చేశా. మధ్యలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా ప్రయత్నించా. నా కెరీర్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం ఇదే తొలిసారి. ఇదొక మల్టీ లేయర్ సబ్జెక్ట్. స్క్రీన్‌ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చాలా మంది కొత్త డైరెక్టర్స్‌తో చేశా. కాసరగడ్డ నానికి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలో జరగనున్న నాని పెళ్లి గిఫ్ట్‌గా ఈ సినిమా సక్సెస్ అందిస్తాం. ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ రమేశ్ కేవలం 41 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఎక్కువ భాగం ఒకే ఇంట్లో షూట్ చేశాం. ఈ సినిమాలో ఎవరు విలన్ అనేది చివరి వరకు కనిపెట్టలేరు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు.


