బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు (డిసెంబర్ 27న) 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు ప్రముఖులు పర్సనల్‌గా, సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడికి ఎక్స్ (ట్విటర్) వేదికగా విషెస్ తెలియజేశారు.
హ్యాపీ బర్త్‌డే
నా ప్రియమైన సోదరుడికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న సల్లూభాయ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంతోషం, ప్రేమ పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు లక్షలాదిమందికి ఒక ఇన్‌స్పిరేషన్.. నిన్ను స్నేహితుడని పిలవడం మాలాంటివారికి దక్కిన అదృష్టం.
ఎంజాయ్ చెయ్
నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి, సుఖసంతోషాలతో గడపాలి. ఈ ప్రత్యేకమైన రోజును హ్యాపీగా ఎంజాయ్ చెయ్ అంటూ సల్లూ భాయ్‌తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాగా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీస్ చేస్తున్నారు. సల్మాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ చేస్తున్నాడు.
Happy 60th birthday to my beloved brother @BeingSalmanKhan 🌟
Sallu bhai, on this special milestone, I want to share my heartfelt wishes with you. May this year bring you endless joy, good health, and all the love you truly deserve. You have always been an inspiration, not just… pic.twitter.com/4ESoduO2yA— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2025


