బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ- యామీ గౌతమ్ జంటగా నటించిన చిత్రం 'హక్'. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దర్శకుడు సుపర్ణ్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదలైంది. ఈ చిత్రం మహిళల హక్కులకు మద్దతు ఇచ్చిన షా బానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు ఆధారంగా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే, ‘హక్’ సినిమాలో ఇస్లాం విడాకుల పద్ధతిని ప్రశ్నిస్తూ సాగే ఒక సీన్‌పై వివాదం మొదలైంది. దీంతో బ్యాన్ చేయాలని ఆ సమయంలో డిమాండ్ కూడా చేశారు.

హక్ సినిమా జనవరి 2, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ కోర్ట్ డ్రామా మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందింది. విమర్శకుల నుంచి కూడా అభినందనలు వచ్చాయి. షా బానో నిజజీవిత కథ మళ్లీ ఒకసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకొచ్చింది. హక్ సినిమాకు షా బానో త్రిబుల్ తలాక్ కేసే ప్రేరణగా తీశారు. మహిళల హక్కులు, లౌకికవాదం, మతం వంటి అంశాలపై ఈ మూవీ ఉంటుంది. పెళ్లైన 40 ఏళ్ల తర్వాత త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులు ఇస్తే పరిస్థితి ఏంటి..? న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఏంటి అనేది హక్ మూవీలో చూడొచ్చు.


