breaking news
Agadha Movie
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌తో..‘అగధ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 25 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంటి నుంచే ఈ మిస్టిక్ థ్రిల్లర్‌ను చూసే అవకాశం దక్కింది. రెండు గంటల 17 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు హీరోహీరోయిన్లు, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్కు ప్రశంసలు దక్కాయి. హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘అగధ’ ఓటీటీ ప్రీమియర్ ఆసక్తికరంగా మారింది.కథ ఏంటంటే..మహిమ (ఉల్కా గుప్తా) ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఓ గుహను చూస్తుంది. ఆ గుహ వద్ద ఓ వింత ఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బబ్లూ మరణిస్తాడు. ఆమె ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి) మాత్రం కనిపించడు. ఇంకో వైపు మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఊర్లోని ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటుంది. ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. ఇక కొన్ని రోజులకు మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి మహిమ మరణంతో మహాదేవి సొంత ఊరికి వస్తుంది. తన ఇంటికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉందని మహాదేవి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో సింహా నుంచి మహాదేవి తెలుసుకున్న అంశాలు ఏంటి? ఈ షికావో గుహ వద్ద ఏం జరిగింది? అసలు ఈ అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్ని ఈ అగధ ఎందుకు చంపుతోంది? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? ఈ కథలో హరిణి (జోవికా విజయ్ కుమార్) పాత్ర, బాబా (షిజు) కారెక్టర్ ఏంటి? అన్నదే కథ. ఇదీ చదవండి: ‘పీరియడ్స్ వస్తే నరకం.. నొప్పులు భరించలేక..: శ్రుతిహాసన్ View this post on Instagram A post shared by Zee 5 Telugu (@zee5telugu) -
'అగధ'తో సర్ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి!
'అగధ'.. మిస్టిసిజం, సూపర్ నేచురల్ అంశాలతో అల్లుకున్న ఒక అట్మాస్పియరిక్ థ్రిల్లర్ సినిమా. గత వీకెండ్ థియేటర్లలో రిలీజైంది. ఇందులో హీరో కమ్ యాంటీ హీరోగా శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. చాలా సహజంగా, మనకు తెలిసిన వ్యక్తిలా కనిపించే ఆ పాత్ర, కథ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కో కొత్త కోణాన్ని బయటపెడుతుంది. ఆ మార్పులను శ్రవణ్ చాలా సునాయాసంగా తన నటనలో తీసుకొచ్చాడు.పాజిటివ్, నెగిటివ్ షేడ్స్ మధ్య ఉండే ఆ క్లిష్టమైన గ్రే జోన్‌ని శ్రవణ్ ఎంతో సమర్థంగా పట్టుకున్నాడు. అతను ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా ఉన్న క్షణాల్లో కూడా, ఆ పాత్రలో ఇంకేదో దాగి ఉందనే భావన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సినిమా మొదట్లో మనం చూసిన పాత్రను, చివరికి పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తాడు. -
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే..మహిమ (ఉల్కా గుప్తా) ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఓ గుహను చూస్తుంది. ఆ గుహ వద్ద ఓ వింత ఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బబ్లూ మరణిస్తాడు. ఆమె ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి) మాత్రం కనిపించడు. ఇంకో వైపు మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఊర్లోని ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటుంది. ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. ఇక కొన్ని రోజులకు మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి మహిమ మరణంతో మహాదేవి సొంత ఊరికి వస్తుంది. తన ఇంటికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉందని మహాదేవి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో సింహా నుంచి మహాదేవి తెలుసుకున్న అంశాలు ఏంటి? ఈ షికావో గుహ వద్ద ఏం జరిగింది? అసలు ఈ అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్ని ఈ అగధ ఎందుకు చంపుతోంది? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? ఈ కథలో హరిణి (జోవికా విజయ్ కుమార్) పాత్ర, బాబా (షిజు) కారెక్టర్ ఏంటి? అన్నదే కథ.ఎలా ఉందంటే?అగధ సినిమాకి టైటిల్ మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. కథ మాత్రం చాలా పాతగా ఉంటుంది. ఇంత వరకు మనం దేవుడు, దెయ్యం అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాల్ని చూసి ఉంటాం. అలాంటి కేటగిరీలోకే ఈ చిత్రం కూడా చేరుతుంది. కానీ ఇందులో దేవుడు, దెయ్యం రెండూ మనకు ప్రత్యక్షంగా కనిపించవు. దైవ శక్తి, దుష్టశక్తికి జరిగే పోరు ఎంతో ఇంట్రెస్ట్‌గా, ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా సాగాలి. కానీ ఇందులో అలాంటి అంశాలేవీ కనిపించవు. ఎక్కడా కూడా కొత్త సీన్ గానీ, అద్భుతంగా అనిపించే ఎపిసోడ్స్ కానీ రావు. ఫస్ట్ హాఫ్ సో సో గానే అనిపిస్తుంది. ఆరంభం ఓ పది నిమిషాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత కామాక్షి పాత్ర ఎంట్రీతో కాస్త డల్‌గానే సాగుతుంది. మహిమ పాత్ర ఆత్మహత్య చేసుకోవడం, హరిణి వింత ప్రవర్తన, సింహా ఎంట్రీ ఇవన్నీ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఏమంతా గొప్పగా అనిపించదు. ఇక ఆ గుహలో ఏం జరిగింది? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, అగధ ఎవరు అనే ఆసక్తిని రేకెత్తించడంతో ఇంటర్వెల్ కార్డ్‌ను వేస్తారు. సెకండాఫ్ మీద అందరికీ ఓ ఉత్సుకత కలిగేలా కట్ చేస్తారు. సెకండాఫ్‌లో ఏదైనా మెరుపులు, కొత్తదనం ఉంటాయని ఆశిస్తే నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. దైవ శక్తిని కూడా గొప్పగా చూపించినట్టు కనిపించదు, దుష్ట శక్తి కూడా అంతగా విజృంభించదు. అసలు ఈ రెండింటి మధ్య అంత యుద్దం, భీకరమైన సన్నివేశాలు కనిపించదు. దైవానికి, దుష్టశక్తికి పోరాటం అంటే మామూలుగానే గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారంతా. కానీ ఇందులో అలాంటి మూమెంట్స్ ఉండవు. పైగా క్లైమాక్స్ సాదాసీదాగా అనిపిస్తుంది. ఇదేంటి ఇంత సింపుల్‌గా తేల్చారు, తేలిపోయినట్టుందే అన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరగా అగధ అద్భుతం అనిపించకపోయినా.. ఓ మోస్తరుగా మెప్పించే అవకాశం ఉంది.ఎవరెలా చేశారంటే..కామాక్షి భాస్కర్ల తన పాత్రకు న్యాయం చేసింది. మహాదేవి కట్టూబొట్టూ ఇలా అన్నింట్లోనూ వేరియేషన్స్ చూపించింది. శ్రవణ్ రెడ్డికి నటించే స్కోప్ దక్కింది. విలనిజం బాగానే చూపించాడు. జోవికా, ఉల్కా గుప్తా, భాను చందర్, షిజు, వనితా ఇలా అందరూ మంచి నటనను కనబర్చారు. వైవా రాఘవ్, కనకవ్వ లాంటి ఇతర పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.సాంకేతిక విషయాలకొస్తే..‘అగధ’ కెమెరామెన్ నాని మంచి అవుట్ పుట్ ఇచ్చారు. విజువల్స్ నేచురల్‌గా ఉంటాయి. సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్ మాత్రం గొప్పగా అనిపించవు. రాకేష్ మ్యూజిక్ బాగుంటుంది. జునైద్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. రాజీవ్ సెట్ వర్క్ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉంటాయి. మొదటి సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి. -
'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు)
-
‘ఎన్టీఆర్ చికెన్’ కామెంట్స్‌పై ఎంఎస్ రాజు క్లారిటీ
‘అగధ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్ రాజు చేసిన ‘చికెన్’ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్స్ ఎం.ఎస్ రాజుని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ ‘చికెన్’ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్‌పై అంతులేని అభిమానంతోనే ఆ మాటలు అన్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పాడు.ప్రీరిలీజ్ ఈవెంట్ ఎం.ఎస్ రాజు ఏమన్నారంటే.. ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాడని చెప్పాడు. తను పడిన కష్టం గురించి చెబుతూ..‘ఏడాదిన్నర పాటు ఎన్టీ రామారావు గారిలాగే నేను కూడా ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. ఆయనలాగా చికెన్ తినలేదు కానీ.. నేనే పాలు కాచుకొని తాగుదాం అనుకుంటే నా భార్యలేచి కాఫీ పెట్టి ఇచ్చేది. అక్కడ నుంచి మొదలెడితే అర్థరాత్రి వరకు సినిమా గురించే ఏదో ఒక పని చేసేవాడిని’అని చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌లాగా చికెన్ తినలేదని వ్యంగ్యంగా అనడాన్ని కొంతమంది నెటిజన్స్ తప్పుపట్టారు. ఎం.ఎస్ రాజుని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేశారు.అభిమానంతోనే అలా.. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. రామారావుగారిపై ఉన్న అభిమానంతోనే అలా అన్నానని చెప్పాడు. ‘నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. పొద్దున లేవగానే వ్యాయామం చేసేవాడు. ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ చేసి.. తినడానికి వెళ్లేవాడు. పక్కనే మేము ఉంటే కూడా తినడానికి తీసుకెళ్లేవాడు. మాకు కూడా గారెలు, చికెన్ తెప్పించే వాళ్ళు. ఆయన ఒక మంచి కోడిని ఎదురుగా పెట్టుకొని తినేవాళ్లు. నేను జరిగిందే చెప్తున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ అయ్యేది అప్పట్లో సోషల్ మీడియా ఉంటే. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనలా ఉండాలి అని అనుకున్నాను. ఆయనలా ఉదయాన్నే లేచి పూజ చేసుకొని సినిమా చేశాను చికెన్ ఒక్కటే తినలేదు కాబట్టి ఆ మాట చెప్పాను అంతే. రామారావు గారి మీదున్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలు నేను సరదాగా అన్నాను. మా నాన్న గారు, రామారావు గారికి మంచి అనుబంధం ఉంది. మా నాన్న గారికి రామారావు గారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చివరి నిమిషంలో ఎన్నికల వల్ల మిస్ అయింది. ఆయన నిబద్దత, క్రమశిక్షణను దగ్గర్నుండి చూశాను. ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం నన్ను ట్రోల్ చేయదు. మిగతా ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు’ అని ఎం.ఎస్ రాజు అన్నారు. ‘అగధ’ విషయానికొస్తే.. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)
-
'నా తొమ్మిదేళ్ల కష్టం.. ఆయన వల్లే సాధ్యమైంది'.. కామాక్షి ఎమోషనల్
టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి పరిచయం అక్కర్లేదు. పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించింది. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు డైరెక్షన్లో వస్తోన్న అగధ మూవీలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన కామాక్షి తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే.. నా తొమ్మిదేళ్ల కష్టమని కామాక్షి తెలిపింది. నా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే ఇంతవరకు వచ్చానని ఎమోషనలైంది. నా కెరీర్‌కి పునాది రాయి వేసింది మాత్రం ఎంఎస్ రాజుగారు మాత్రమేనని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే కష్టమని ఏడ్చేసింది. అలాంటిది నన్ను సినిమాలో లీడ్ రోల్లో తీసుకున్నారని తెలిపింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ మారుతోందని.. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురైంది కామాక్షి.నన్ను స్క్రీన్‌పై చూసింది చాలా తక్కువ.. నేను చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను అలాంటివే చేస్తుందని అనుకుంటారు.. కానీ నా తొమ్మిదేళ్ల కష్టం వాళ్లకు మాత్రమే తెలుసన్నారు. ఈ రోజు ఇక్కడ నేను నిలబడేందుకు నా ఫ్యామిలీ ఎంతో త్యాగాలు చేయాల్సి వచ్చిందని కామాక్షి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మా అన్న, అమ్మ, పిన్ని నాకోసం ఇక్కడికి వచ్చారంటూ ఏడుస్తూ మాట్లాడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. -
గాడ్ వర్సెస్ ఈవిల్
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అగధ’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో అజయ్ కేఆర్ సమర్పణలో శ్రీ ఆదివరాహ ప్రోడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎం.ఎస్. రాజుగారు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’లో నటించాను. కానీ ఆ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. ఆ తర్వాత అజయ్ భూపతిగారి డైరెక్షన్‌లోని ‘మంగళవారం’ చిత్రంలో కీలక పాత్ర చేశాను.ఇప్పుడు ‘అగధ’లో నటించాను. ఈ చిత్రంలో నేను పోషించిన క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇందులో నెగెటివ్ పాత్ర అనేది ఉండదు. పరిస్థితుల వల్లే పాత్రలు అలా ప్రవర్తిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టుగా కథ సాగుతుంది. కథ చెప్పిన నాలుగో రోజే సెట్స్‌కి వెళ్లాను. దీంతో ఈ పాత్ర కోసం నేను ప్రిపేర్ అవ్వాల్సింది అంతా సెట్స్‌లో అయ్యాను.ఈ సినిమా చేయడం యాక్టర్‌గా నాకో కొత్త అనుభూతిని ఇచ్చింది. ఎం.ఎస్. రాజుగారు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ చిత్రం కోసం ఆయన రాసిన కథ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. ఇక ఇండస్ట్రీలో హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. ‘అగధ’తో నాకు ఆ బాక్సాఫీస్ సక్సెస్ స్టాంప్ వస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం దర్శక–ద్వయం రాజ్ అండ్ డీకే దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన రైటర్ చంద్ర తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. ముగ్గురు స్నేహితుల కథ ఇది’’ అని అన్నారు. -
నన్నెందుకు తీసుకోలేదని త్రిష అలిగింది
త్రిష.. పేరుకు తమిళ హీరోయినే కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తమ ఇంటి అమ్మాయిగానే చూసుకుంటారు. ‘వర్షం’తో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశాడు ఎంఎస్ రాజు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరైంది. ఇప్పటికీ త్రిష అనగానే..తెలుగు ఆడియన్స్‌కి ఆ సినిమానే గుర్తొస్తుంది. అంతలా తన సహజ నటనతో ఆకట్టుకుంది త్రిష. అయితే ఈ సినిమాకు మొదటగా త్రిషని అనుకోలేదట. వేరే హీరోయిన్ని తీసుకోవాలని అనుకుంటే..త్రిషనే పట్టుపట్టి నటించిదట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శక-నిర్మాత ఎంఎస్ రాజు.‘వర్షం కోసం త్రిషను అనుకోకుండా తీసుకున్నాం. ఓ రోజు మహేశ్ బాబు ఆఫీస్‌లో త్రిష ఫోటో చూశా. తన కొత్త సినిమా కోసం తీసుకుందామని అనుకుంటే.. క్యారెక్టర్‌కి సెట్ అవ్వట్లేదని మహేశ్ చెప్పాడు. అయితే నా సినిమాలో హీరోయిన్గా తీసుకోవచ్చా అని ఫోటోలు అడిగా. ఆ తర్వాత చెన్నై వెళ్లి త్రిష వాళ్ల అమ్మతో మాట్లాడా. అప్పుడు త్రిష ఇంట్లో లేదు. నేను మాట్లాడుతుండగా.. జీన్స్‌తో వచ్చింది. కొంచెం బరువు తగ్గాలని చెప్పా. అంటే.. ‘హీరోయిన్గా మా అమ్మాయిని తీసుకున్నారా?’ అని త్రిష వాళ్ల అమ్మ అడిగింది. నేను అవునని చెప్పి వచ్చేశా. వర్షం సినిమా సమయంలో దాదాపు 70 రోజులు వానలో తడిసింది త్రిష. నేను ఏది చెబితే అది చేసేది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో వేరే హీరోయిన్ని తీసుకోవాలనుకున్నాం. ఈ విషయం త్రిషకు తెలిసింది. ఒక రోజు ఎయిర్‌పోర్ట్‌లో దిగి..డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చింది. భోజనం చేసింది. తర్వాత డైయిరీ తీసి.. ‘నీకు ఎన్ని రోజులు డేట్స్ కావాలో రాసుకో’ అని చెప్పింది. అంతలా నాపై ప్రేమ చూపించేది. ఆమెకు నేనంటే ప్రాణం. ఎంతలా అంటే ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వాళ్లు..'రాత్రి 3 గంటలకు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు' అని ఆమెని అడిగితే మరో ఆలోచన లేకుండా నా పేరు చెప్పింది.ఇక ‘ఆట’ సినిమా షూటింగ్ సమయంలో త్రిష నాపై అలిగింది. ఆ చిత్రానికి నేను ఇలియానాను తీసుకోవడంతో బాధపడింది. విషయం తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేసి షూటింగ్ స్పాట్‌కు వస్తానని చెప్పింది. దానికి నేను 'ఇప్పటికే హీరోయిన్ను ఫైనల్ చేశాం. మేము రాజమండ్రి దగ్గర బోటులో షూటింగ్ చేస్తున్నాం అని చెప్పాను. ఆ తర్వాత త్రిష మౌనంగా ఉండిపోయింది. బాధపడి ఉంటుందని చెప్పి ఆ రోజు సాయంత్రం నేను ఆమెకు ఫోన్ చేసి, 'నీలాంటి వారు ఎవరూ ఉండరు. ఇలియానాతో ఇబ్బంది అవుతుందని సరదాగా చెప్పా. వాస్తవానికి ఇలియానా చాలా బాగా నటించింది. కానీ త్రిషని ఓదార్చడానికి అలా అబద్దం చెప్పా’ అని ఎంఎస్ రాజు త్రిషతో తనకు ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చాడు. -
శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటా : ఎం.ఎస్ రాజు
‘‘ఇంతకుముందు నేను చేయని కథల్ని ఇప్పుడు ప్రయత్నించాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు గాలి సోకిందని కొన్ని రోజులు స్కూల్ మాన్పించారు. ఆ ఘటన నా మదిలో అలా ఉండిపోయింది. ‘అగధ’ సినిమా చేయడానికి ఇది కూడా ఒక కారణం. యూత్, జెన్ జీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నా ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేశాం’’ అని ఎం.ఎస్ రాజు అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, భాను చందర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ కేఆర్ సమర్పణలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కేవీఎల్ఎన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ–‘‘ఒక్కడు’ సినిమాకి మహేశ్ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’కి సిద్ధార్థ్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్ కిరణ్ కరెక్ట్‌గా యాప్ట్ అయ్యారు. అలా ‘అగధ’ కి ఇందులో నటించిన వారంతా కరెక్ట్‌గా సరిపోయారు. నాకు రిటైర్ అవడం ఇష్టం ఉండదు. నా శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను’’ అన్నారు. -
'అగధ' సినిమా ట్రైలర్ ఆవిష్కరణ ఈవెంట్ (ఫొటోలు)
-
‘అగధ’ సినిమా టీజర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అగధ నా కలల ప్రాజెక్ట్ : ఎం.ఎస్. రాజు
‘‘ఫిల్మ్ మేకర్స్‌గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాలు తీశాను. ఇప్పుడు నా కలల ప్రాజెక్ట్ అయిన ‘అగధ’ని ఈ స్థాయికి తీసుకువచ్చిన విశాలాక్షి, డా. రాజు, సుబ్బరాజులకు థ్యాంక్స్. టీజర్లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. మా చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’’ అని ఎం.ఎస్. రాజు చెప్పారు. కామాక్షీ భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘అగధ’. ఎం.ఎస్. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ–‘‘ఎం.ఎస్. రాజుగారి వల్లే సినిమా నిర్మాణంలోకి వచ్చాను. మా మూవీని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. కామాక్షీ భాస్కర్ల మాట్లాడుతూ–‘‘అగధ’లో మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన రాజుగారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘డర్టీ హరి’ చిత్రం ద్వారా నన్ను వెండితెరకు పరిచయం చేసిన ఎం.ఎస్.రాజుగారితోనే ‘అగధ’ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రవణ్ రెడ్డి. ‘‘అగధ’లో నా ఫస్ట్ లుక్ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజులగారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించడం సంతోషంగా ఉంది’’ అని నటి జోవికా విజయ్ కుమార్ చెప్పారు. -
'షూటింగ్లో పాము కాటు.. వనితా మాటలకు షాకయ్యాం..'
కోలీవుడ్ నటి వనితా విజయ్‌కుమార్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. 1999లోనే దేవి మూవీలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె కూతురు సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గతేడాది తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా పాల్గొన్న జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తోన్న అగధ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన ఎంఎస్ రాజు మాట్లాడారు. 1999లో వచ్చిన దేవి మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దేవి సినిమా షూటింగ్లో వనిత విజయ్ కుమార్‌ను పాము కాటేసిందని తెలిపారు. అప్పుడు మేమంతా తెగ కంగారు పడిపోయామని వెల్లడించారు. కానీ వనితా మాత్రం ఎలాంటి భయం లేకుండా అమ్మవారే తనను కాపాడుతుందని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంత ధైర్యవంతురాలో చెప్పాలంటే ఈ ఒక్క సంఘటన చాలని ఎంఎస్ రాజు ప్రశంసలు కురిపించారు. కాగా.. 1999లో వచ్చిన దేవి సినిమాకు ఎంఎస్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో కామాక్షీ భాస్కర్ల మహాదేవి పాత్రలో కనిపించనుంది. -
రహస్యం ఏంటి?
ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్‌ని ఇటీవల రివీల్ చేశారు మేకర్స్. తాజాగా నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన సింహ పాత్ర లుక్‌ను విడుదల చేశారు. ‘‘డర్టీ హరి’ చిత్రంతో శ్రవణ్ రెడ్డిని తెలుగు తెరకు పరిచయం చేశారు ఎం.ఎస్. రాజు. ఇప్పుడు మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారాయన. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్... దాదాపు 45 నిమిషాల వీఎఫ్ఎక్స్తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Agadha: ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల.. లుక్ అదిరింది!
'దేవి', 'శత్రువు', 'ఒక్కడు', 'వర్షం', 'మనసంతా నువ్వే', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి కల్ట్ చిత్రాల నిర్మాత , ‘డర్టీ హరి’, ‘ మళ్లీ పెళ్లి ‘ చిత్రాల దర్శకుడు ఎం.ఎస్. రాజు మరో సూపర్ ఇంట్రెస్టింగ్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నారు. ఆయన తాజా చిత్రం 'అగధ'లో మహాదేవి పాత్ర పరిచయం ఈ మర్మమైన, దైవిక థ్రిల్లర్‌కు కొత్త ఉత్కంఠను జోడిస్తుంది.'అగధ' ఫస్ట్ లుక్‌తో రేగిన ఉత్సుకత ఇప్పుడు తదుపరి వెల్లడికి దారితీసింది. మునుపటి పోస్టర్లో దైవ విగ్రహం ముందు నిలబడి కనిపించిన ఆ రహస్య యువతి మరెవరో కాదు, కామాక్షి భాస్కర్ల అని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆమె ఈ చిత్రంలో కీలక కథానాయిక మహాదేవి పాత్రను పోషిస్తున్నారు.ఈ ప్రకటనతో, మొదటి పోస్టర్ ద్వారా ఎంఎస్ రాజు సృష్టించిన దృశ్యరూపానికి ఇప్పుడు ఒక ముఖం, శక్తివంతమైన తెరపై ఉనికి లభించాయి. త్రిశూలాలు, దీపాలు, ఎత్తైన విగ్రహంతో కూడిన ఆధ్యాత్మిక నేపథ్యం ముందు, సాంప్రదాయ నల్ల చీర కట్టుకుని గంభీరంగా కూర్చున్న కామాక్షి భాస్కర్ల రూపమే, కథనంలో ఆమె పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని సూచిస్తోంది. ఆమె ప్రచండమైన హావభావం, సాంప్రదాయ రూపం, ఆ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం, మహాదేవి కేవలం ఒక సాధారణ పాత్ర కాదని, కథ యొక్క ఆధ్యాత్మిక మూలంతో గాఢంగా ముడిపడి ఉన్న వ్యక్తి అని తెలియజేస్తున్నాయి.


