అగధ నా కలల ప్రాజెక్ట్‌ : ఎం.ఎస్‌. రాజు | MS Raju Talks About Agadha Movie | Sakshi
Sakshi News home page

అగధ నా కలల ప్రాజెక్ట్‌ : ఎం.ఎస్‌. రాజు

May 8 2026 8:18 AM | Updated on May 8 2026 8:51 AM

MS Raju Talks About Agadha Movie

‘‘ఫిల్మ్‌ మేకర్స్‌గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాలు తీశాను.  ఇప్పుడు నా కలల ప్రాజెక్ట్‌ అయిన ‘అగధ’ని ఈ స్థాయికి తీసుకువచ్చిన విశాలాక్షి, డా. రాజు, సుబ్బరాజులకు థ్యాంక్స్‌. టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. మా చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’’ అని ఎం.ఎస్‌. రాజు చెప్పారు. కామాక్షీ భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘అగధ’. ఎం.ఎస్‌. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ–‘‘ఎం.ఎస్‌. రాజుగారి వల్లే సినిమా నిర్మాణంలోకి వచ్చాను. మా మూవీని హిట్‌ చేస్తారని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. 

కామాక్షీ భాస్కర్ల మాట్లాడుతూ–‘‘అగధ’లో మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన రాజుగారికి థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు. ‘‘డర్టీ హరి’ చిత్రం ద్వారా నన్ను వెండితెరకు పరిచయం చేసిన  ఎం.ఎస్‌.రాజుగారితోనే ‘అగధ’ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రవణ్‌ రెడ్డి. ‘‘అగధ’లో నా ఫస్ట్‌ లుక్‌ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజులగారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించడం సంతోషంగా ఉంది’’ అని నటి జోవికా విజయ్‌ కుమార్‌ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement