ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్‌ని ఇటీవల రివీల్ చేశారు మేకర్స్.
తాజాగా నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన సింహ పాత్ర లుక్‌ను విడుదల చేశారు. ‘‘డర్టీ హరి’ చిత్రంతో శ్రవణ్ రెడ్డిని తెలుగు తెరకు పరిచయం చేశారు ఎం.ఎస్. రాజు. ఇప్పుడు మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారాయన. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్... దాదాపు 45 నిమిషాల వీఎఫ్‌ఎక్స్‌తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


