breaking news
Post-production
-
రహస్యం ఏంటి?
ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్‌ని ఇటీవల రివీల్ చేశారు మేకర్స్. తాజాగా నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన సింహ పాత్ర లుక్‌ను విడుదల చేశారు. ‘‘డర్టీ హరి’ చిత్రంతో శ్రవణ్ రెడ్డిని తెలుగు తెరకు పరిచయం చేశారు ఎం.ఎస్. రాజు. ఇప్పుడు మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారాయన. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్... దాదాపు 45 నిమిషాల వీఎఫ్ఎక్స్తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
హెవీ యాక్షన్‌తో...
‘‘హెవీ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ‘డైనమైట్’. సౌండ్ మిక్సింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ సినిమా తుది దశలో ఉంది. జూలై 3న సినిమా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూలై 17 లేదా 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని మంచు విష్ణు తెలిపారు. దేవ కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘డైనమైట్’. ఇందులో ప్రణీత కథానాయిక. దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ -‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. అన్ని సన్నివే శాలు బాగా వచ్చాయి’’ అని చెప్పారు. విష్ణు డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఈ చిత్రానికి హైలైట్ అని రచయిత బీవీయస్ రవి అన్నారు.


