భార‌త సెల‌క్ట‌ర్ల సంచ‌ల‌న నిర్ణ‌యం.. వికెట్ల వీరుడికి నో ఛాన్స్‌ | No Manav suthar as BCCI announces India's Test squad for New Zealand tour | Sakshi
Sakshi News home page

IND vs NZ: భార‌త సెల‌క్ట‌ర్ల సంచ‌ల‌న నిర్ణ‌యం.. వికెట్ల వీరుడికి నో ఛాన్స్‌

Oct 17 2026 1:52 AM | Updated on Oct 17 2026 2:14 AM

No Manav suthar as BCCI announces India's Test squad for New Zealand tour

న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల కోసం భారత జట్లను సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు. టెస్టు టీమ్‌తో పాటు తొలి మూడు వన్డేలకు శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యం వహించనుండగా... చివరి 2 వన్డేలకు శ్రేయస్‌ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. శ్రీలంకతో చివరిసారిగా టెస్టులు ఆడిన భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

సుతార్‌పై వేటు.. జ‌డ్డూ రీఎంట్రీ
రవీంద్ర జడేజాకు సరైన వారసుడంటూ ప్రచారం కల్పించిన లెఫ్టార్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మానవ్‌ సుతార్‌పై వేటు వేసి టీమ్‌లో మళ్లీ జడేజాకే చోటు ఇచ్చారు. స్పిన్ బౌలర్ల కోటాలో జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశమిచ్చారు. అయితే అరంగేట్రం నుంచి అసాధరణ ప్రదర్శన కనబరుస్తున్న సుతార్‌ను ఎంపిక చేయకపోవడాన్ని మాజీలు తప్పుబడుతున్నారు. సుతార్‌ తాను ఆడిన తొలి 3 టెస్టుల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు.

అరంగేట్రంలోనే అద్భుతం
ఈ ఏడాది జూన్‌లో చండీగఢ్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున సుతార్ అరంగేట్రం చేశాడు. త‌న డెబ్యూ టెస్టులోనే 7 వికెట్లు ప‌డగొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ త‌ర్వాత శ్రీలంక గ‌డ్డ‌పై కూడా సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. గాలే వేదిక‌గా లంక‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా ప‌ది వికెట్లు సాధించాడు. 

త‌ద్వారా శ్రీలంక గడ్డపై ఒకే టెస్టులో 10 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అశ్విన్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. అయిన‌ప్ప‌టికి అత‌డిని జ‌ట్టులో కొన‌సాగించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే  కివీస్ పిచ్‌లు ప్రధానంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకునే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీలంక పర్యటనకు ఎంపికైన పేసర్‌ ఆకిబ్‌ నబీ, స్పిన్నర్‌ సారాన్ష్‌ జైన్‌ సైతం సెలక్టర్లు పక్కన పెట్టారు.

జట్ల వివరాలు:
తొలి మూడు వన్డేలకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ*, కుల్దీప్ యాదవ్.

నాలుగు, ఐదు వన్డేలకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్)*, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement