Srinidhi Shetty Doubles Her Remuneration For Cobra Deets Inside - Sakshi
Sakshi News home page

Srinidhi Shetty Remuneration: అక్కడింకా మొదటి సినిమానే, అయినా రెమ్యునరేషన్‌ మాత్రం డబుల్‌..

Jul 13 2022 2:49 PM | Updated on Jul 13 2022 3:20 PM

Srinidhi Shetty Doubles Her Remuneration For Cobra - Sakshi

అయితే ఈ గుర్తింపును క్యాష్‌ చేసుకోవాలనుకుందీ కన్నడ కుట్టి. అందులో భాగంగా తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

కేజీఎఫ్‌ 1, 2 సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాల్లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ బోలెడంత గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ గుర్తింపును క్యాష్‌ చేసుకోవాలనుకుందీ కన్నడ కుట్టి. అందులో భాగంగా తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె కోబ్రా సినిమాతో తమిళంలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే కదా! కోలీవుడ్‌లో తొలి సినిమాకే ఆమె భారీ రేంజ్‌లో డిమాండ్‌ చేస్తోందట. కేజీఎఫ్‌ చాప్టర్‌ 2కు ఆమె మూడు కోట్లు తీసుకుంటే కోబ్రాకు ఏకంగా రూ.6-7 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఇది తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఆ రేంజ్‌లో తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినీవిశ్లేషకులు. కాగా కోబ్రా సినిమాను అజయ్‌ జ్ఞానముత్తు డైరెక్ట్‌ చేయగా సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

చదవండి: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ఎఫ్‌3 మూవీ, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌
అతియా, రాహుల్‌ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్‌ శెట్టి

Advertisement
 
Advertisement
Advertisement