Suniel Shetty Gives Calrity On KL Rahul And Athiya Shetty Marriage Rumours, Details Inside - Sakshi
Sakshi News home page

Sunil Shetty On KL Rahul Marriage: అతియా, రాహుల్‌ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్‌ శెట్టి

Jul 13 2022 10:26 AM | Updated on Jul 13 2022 11:16 AM

Suniel Shetty Reacts On Athiya Shetty KL Rahul Wedding Rumours - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ, నటుడు సునీల్‌ శెట్టి తనయ అతియా శెట్టి, క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పటికే ఇరుకుంటుంబ సభ్యులు కలుసుకుని మాట్లాడుకున్నారని, పెళ్లి ముహుర్తం కూడా ఖారరైందంటూ బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ జంట ఫ్యాన్స్‌లో సందేహాలు నెలకొన్నాయి.

చదవండి: డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్‌ మూవీ!

ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమార్స్‌పై అతియా తండ్రి సునీల్‌ శెట్టి స్పందించాడు. ఇటీవల రేడియో మిర్చికి ఇచ్చిన ఇంటర్య్వూలో కూతురు అతియా-రాహుల్‌ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చాడు. అతియా, రాహుల్‌ పెళ్లికి డేట్‌ ఫిక్సయిందని, కార్డ్స్‌ కూడా ప్రింట్‌ అవుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయని, ఇందులో నిజమేంత అని సునీల్‌ శెట్టి ప్రశ్నంచగా.. అలాంటిది ఏం లేదని, ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదంటూ ఆయన రూమర్లకు చెక్‌ పెట్టాడు. ఇక ఇటీవల ఓ షోలో పాల్గొన్న అతియా సోదరుడు అయాన్‌ శెట్టికి సైతం ఇదే ప్రశ్న ఎదురవగా.. ‘ఈ వార్తల్లో నిజం లేదు.. మా ఇంటిలో ఎలాంటి పెళ్లి ఏర్పాట్లు జరగడం లేదు. ఏదైన ఉంటే మేం ముందుగా చెబుతాం కదా’ అన్నాడు. 

చదవండి: పెళ్లి అనంతరం అదే జోరు.. 75వ చిత్రానికి రెడీ అయిన నయన్‌

ఇక పెళ్లి డేట్‌పై రూమార్స్‌పై అడగ్గా.. అసలు పెళ్లే జరగడం లేదు.. ఇక డేట్‌ ఎలా చెప్పగలనంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇదిలా ఉంటే గత మూడేళ్లుగా ప్రేమించుకున్నఅతియా, రాహుల్‌లు మరో మూడు నెలల్లో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని ఈ జంజ సన్నిహితుల నుంచి సమాచారం. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు రాహుల్‌ తల్లిదండ్రులు ఇటీవలే అతియా తండ్రి సునీల్‌ శెట్టిని కలిశారని, ఈ రెండు కుటుంబాలు కలిసి రాహుల్‌-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని (ముంబై) సందర్శంచారని.. అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని వారు నిర్ణయించారని అతియా సన్నిహితవర్గాలు పేర్కొన్నాయంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement