
'డీజే టిల్లు' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'తెలుసు కదా'. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు కాగా.. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం(అక్టోబరు 17) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)
ట్రైలర్‌లో అయితే స్టోరీ ఏంటనేది అస్సలు రివీల్ చేయలేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్‌లోనే ఉండాలి. ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వం. అలాంటిది ఇద్దరమ్మాయిలతో రిలేషన్‌లోకి వెళ్తాడు. వాళ్లిద్దరూ కలిసి అంటే ముగ్గురు జర్నీ చేస్తారు? ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది? అనేదే తెలియాలంటే మూవీ చూడాలి. చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీలా అయితే అనిపించట్లేదు. మరి సిద్ధు ఈసారి ఏం చేస్తాడో చూడాలి?
ఈ సినిమాతో పాటు ఇదే వీకెండ్‌లో మరో మూడు మూవీస్ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. అవే 'మిత్రమండలి', 'డ్యూడ్', 'కె ర్యాంప్'. ఈ చిత్రాల ట్రైలర్స్ ఇప్పటికే రిలీజ్ కాగా, ఇవి కూడా బాగానే అనిపించాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుంది? ప్రేక్షకుల మనసు ఏది గెలుచుకుంటుందనేది చూడాలి? గత నెలలో టాలీవుడ్‌కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమాల బట్టి ఈనెల కూడా కలిసొస్తుందా లేదా అనేది తేలుతుంది.
(ఇదీ చదవండి: సాయంత్రం 6 గంటలకే వచ్చాడుగా ఏమైంది? మురుగకి సల్మాన్ కౌంటర్)