
ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. స్టార్ హీరోల గురించి, సినిమాల ఫెయిల్యూర్స్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం అసందర్భంగా ఇలాంటి విషయాలు బయటపడుతుంటాయి. కొన్నిరోజుల క్రితం తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్.. సల్మాన్‌పై నేరుగా కౌంటర్స్ వేశాడు. 'సికిందర్' ఫ్లాప్ కావడానికి అతడే బాధ్యుడు అన్నట్లు మాట్లాడాడు. దీంతో సల్మాన్ ఫ్యాన్స్‌తో పాటు చాలామంది షాకయ్యారు.
'మదరాసి' సినిమా ప్రమోషన్లలో టైంలో దర్శకుడు మురుగదాస్.. సల్మాన్ ఖాన్‌పై ఈ కామెంట్స్ అన్నీ చేశాడు. రాత్రి 9 గంటల తర్వాత హీరో షూటింగ్‌కి వచ్చేవాడని, పిల్లల్ని స్కూల్‌కి పంపే సీన్స్ కూడా అర్థరాత్రి 2-3 గంటలకు తీశామని మురుగదాస్ అన్నాడు. అప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్న సల్మాన్.. ఇప్పుడు బిగ్‌బాస్-19 వీకెండ్ ఎపిసోడ్‌లో ఈ విషయమై స్పందించాడు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మురుగదాస్‌పై అదిరిపోయే పంచులు వేశాడు.
(ఇదీ చదవండి: Bigg Boss 9: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!)

'విపరీతమైన గాయాల వల్ల నేను షూటింగ్‌గా ఆలస్యంగా వస్తే దాన్ని మరోలా చెప్పుకొని నెగిటివ్ చేశారు. ముందు నిర్మాత సాజిత్ నడియావాలా తప్పుకొంటే.. తర్వాత సౌత్ సినిమా మదరాసి తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయారు. అక్కడి యాక్టర్ సాయంత్రం ఆరు గంటలకే సెట్‌కి వచ్చావాడు. అందుకే అది సికిందర్ కన్నా చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది' అని సల్మాన్ ఖాన్ సెటైరికల్‌గా గట్టిగానే కౌంటర్స్ వేశాడు.
ఇన్ని చెప్పిన మురుగదాస్.. 'మదరాసి' సినిమాతో ఘోరమైన ఫలితాన్ని అందుకున్నాడు. తెలుగులో ఇది డిజాస్టర్ అయితే, తమిళంలో యావరేజ్‌గా నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్ల టైంలోనే తెలుగు సినిమాలకు రూ.1000 కోట్ల కలెక్షన్స్ వస్తుండటంపైనా విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. తమిళంలో ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేసే చిత్రాలు తీస్తామని అందుకే అన్ని కోట్ల కలెక్షన్స్ రావని అన్నాడు. దీంతో 'మదరాసి' చిత్రంతో మురుగదాస్.. ప్రేక్షకులకు ఏం విలువలు నేర్పించాడో చెప్పాలని రిలీజ్ టైంలో కౌంటర్స్ గట్టిగానే పడ్డాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)