నువ్వు ఊర మాస్‌ అంటే హ్యాపీగా అనిపించింది

kgf movie sucess meet - Sakshi

యశ్‌

‘‘వందకోట్ల సినిమాలను చేసే సత్తా అన్ని ఇండస్ట్రీలకు ఉంటుంది. ప్రేక్షకులు పెరిగారు. కన్నడ ఇండస్ట్రీ చిన్నదంటే నాకు కోపం వస్తుంది. బాధగా ఉంటుంది. సినిమా కలెక్షన్స్‌ గురించి నిర్మాతలను నేను అడగను. పార్కింగ్‌ క్రౌడ్‌ని మాత్రమే చూస్తాను. నా సినిమా చూసి ఆడియన్స్‌ హ్యాపీ అంటే అదే నా విజయంగా ఫీల్‌ అవుతాను’’ అన్నారు నటుడు యశ్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదలైంది.

తమిళ, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో అనువదించి, విడుదల చేశారు. గురువారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో యశ్‌ మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్‌గారు అభిమానులు దేవుళ్లు అనేవారు. ఆ విషయం నాకు మళ్లీ గుర్తొచ్చింది. నేను ఎవరికీ తెలీదు. నా సినిమాను చూసి నాకు వెల్‌కమ్‌ చెప్పిన తెలుగు ప్రేక్షకులు దేవుళ్లు. పదేళ్ల క్రితం నా వర్క్‌ని చూసి కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు తెలుగువారు సపోర్ట్‌ చేశారు. తెలుగు కాంప్లిమెంట్స్‌ స్పెషల్‌గా ఉంటాయి. ఒకచోట ‘అన్నా నువ్వు ఊర మాస్‌’  అన్నారు.

ఆనందంగా అనిపించింది. నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సెట్‌లోకి వచ్చిన మూడో రోజే సినిమాను రెండు పార్టులుగా తీయాలనుకున్నాం. ఇలాంటి ఒక సినిమాకు మంచి పొజిషన్‌ దొరక్కపోతే ఆడియన్స్‌కు రీచ్‌ అవ్వదు. ఆ పనిని బాగా చేసిన సాయికొర్రపాటి అన్నకు ధన్యవాదాలు. రాజమౌళిగారు ఉన్న స్థాయికి మా సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మా సినిమా గురించి మంచిగా మాట్లాడినప్పుడు భయపడ్డాను. ఆ అంచనాలను అందుకుంటానా? అని.

సినిమాపై నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కేజీ రామారావుగారు గైడ్‌ చేస్తూనే కంట్రోల్‌ చేశారు. ఈ సినిమా సక్సెస్‌ నా ఒక్కడిదే కాదు. టీమ్‌ అందరిదీ. తెలుగు హీరోల సినిమాలు చూసి నేను మరింత బాగా తెలుగు నేర్చుకుంటాను. కేజీఎఫ్‌ రెండో పార్ట్‌ మరింత బాగా రావడానికి కష్టపడతాను’’ అన్నారు. ‘‘కేజీఎఫ్‌’ అంటే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కాదు. కర్ణాటక గోల్డెన్‌ హిట్‌. సక్సెస్‌ సాధించిన ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు హ్యాపీ’’ అన్నారు రచయిత రామజోగయ్యశాస్త్రి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కేజీ రామారావు. రచయిత హనుమాన్, కెమెరామెన్‌ భువన్‌ గౌడ మాట్లాడారు. నిర్మాత సాయి కొర్రపాటి పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top