
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. అంతేకాకుండా హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ సరసన కనిపించనున్న హీరోయిన్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ హీరోయిన్ పేరును వెల్లడించింది. కేజీఎఫ్‌తో స్టార్‌డమ్ దక్కించుకున్న శ్రీనిధిశెట్టి ఈ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి పోస్టర్‌ను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కేజీఎఫ్ తర్వాత టాలీవుడ్‌లో నాని హిట్- 3, ఇటీవలే విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలతో మెప్పించింది. కాగా..ఈ చిత్రం వెంకీ మామ కెరీర్‌లో 77వ సినిమాగా రానుంది. అయితే ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు.
Here’s wishing the gorgeous and graceful @SrinidhiShetty7 a fantastic Birthday! ❤️#HBDSrinidhiShetty 💫
Excited to have you join the journey of our Production No.8 | #Venky77 | #VenkateshXTrivikram | 🎬
Victory @VenkyMama #Trivikram #SRadhaKrishna @haarikahassine pic.twitter.com/AALKT17vZ4— Haarika & Hassine Creations (@haarikahassine) October 21, 2025