
– సిద్ధు జొన్నలగడ్డ
‘‘తెలుసు కదా’ సినిమాలో నేను చేసిన వరుణ్ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వయొలెన్స్ ని జనరేట్ చేస్తుంది. ఏడాదిగా వరుణ్ అనే రాడికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను... ఆ పాత్రకి గుడ్ బై చెప్పడం బాధగా ఉంది’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఆయన హీరోగా, శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది.
బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘ఈ దీపావళికి మా ‘తెలుసు కదా’. ప్రియదర్శి ‘మిత్రమండలి’, కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలు విడుదలవుతున్నాయి. మంచి సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘మా సినిమా తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు శ్రీనిధి. ‘‘తెలుసు కదా’ నా మనసుకు దగ్గరైన సినిమా’’ అని రాశీ ఖన్నా పేర్కొన్నారు. ‘‘మా సినిమాని బిగ్ స్క్రీన్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని కృతీ ప్రసాద్ చెప్పారు. ‘‘ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణం నిర్మాతలే’’ అన్నారు నీరజ కోన.